S. V. Krishna Reddy: సినీ ప్రియలకు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఇతడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడి గా ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇతడు దర్శకుడుగానే కాకుండా రచయితగా సంగీత దర్శకుడిగా చాలా సినిమాల్లో పనిచేశారు. మరి ఈ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన టాప్ సినిమాలు గురించి ఇప్పుడు మనం తెలుసు కుందాం.
ఎగిరే పావురమా: 1997లో విడుదలైన ఎగిరే పావురమా సినిమా భారీ స్థాయిలో విజయం అందుకుంది. ఈ సినిమాలో శ్రీకాంత్, లైలా, జె.డి చక్రవర్తులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మలయాళం లో సల్లపం అనే సినిమాతో రీమేక్ చేశారు.
మాయలోడు: 1993లో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో సౌందర్య హీరోయిన్ గా మెప్పించింది. అప్పట్లో ఈ సినిమా ఎస్ వి కృష్ణారెడ్డికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
రాజేంద్రుడు గజేంద్రుడు: 1993 విడుదలైన ఈ సినిమా లో రాజేంద్రప్రసాద్, సౌందర్య కాంబినేషన్ లో భారీ అంచనాలతో విడుదలైంది. అనుకున్న విధంగానే ఈ సినిమా భారీ స్థాయిలో సక్సెస్ అందుకుంది.
యమలీల: 1994లో ఎస్ వి ఈ సినిమాను భారీ అంచనాలతో ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చాడు. ఈ సినిమాలో ఆలీ, ఇంద్రజ, మంజు భార్గవిలు ప్రధాన పత్రులు పోషించారు. కాగా ఈ సినిమా ఊహించని సక్సెస్ ను అందుకుంది.
శుభలగ్నం: రోజా, జగపతిబాబు కాంబినేషన్లో విడుదలైన ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా స్టోరీ పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డికి కూడా ఈ సినిమా మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది.
మావి చిగురు: 1996లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు స్టోరీ పరంగా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాలో జగపతిబాబు, ఆమని, రంజితలు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో నటనకు గాను జగపతిబాబు కు ఉత్తమ నటుడుగా నంది పురస్కారం ఇచ్చారు.