Director Teja: రాధే శ్యామ్ కు లాభాలు.. పుష్ప కు నష్టాలు.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ తేజ?

Director Teja: ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా గురించి మనందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను తన సొంతం చేసుకుంది.

బాలీవుడ్ లో ఏకంగా ఈ సినిమా 100 కోట్లకు మించి వసూళ్లను రాబట్టి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను మరో స్థాయిలో ఆశ్చర్యపరిచింది. ఈ విషయం గురించి బాలీవుడ్ వర్గాల్లో భారీ స్థాయిలో చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప టు సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాగా ఈ సినిమా షూటింగ్ సుకుమార్ మరింత ముమ్మరంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే దర్శకుడు తేజ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పుష్ప సినిమా వల్ల నష్టాలే కాని.. లాభాలు రాలేదని తెలిపాడు. ప్రస్తుతం తేజ ఆ ఇంటర్వ్యూలో ఇలా స్పందించడం సంచలనంగా మారింది. ఈ సినిమాకు మించి రాధే శ్యామ్ సినిమా కొన్నిచోట్ల లాభాలు తెచ్చి పెట్టిందని తెలిపాడు. రాధే శ్యామ్ సినిమా ఐదు భాషల్లో డిజాస్టర్ గా నిలిచిందని సంగతి మనకు తెలిసిందే.

అయితే డిజాస్టర్ అనిపించుకున్న రాధే శ్యామ్ సినిమా కొన్నిచోట్ల లాభాలు తెచ్చిపెట్టిందట. పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్న పుష్ప పలుచోట్ల నష్టాలు తెచ్చి పెట్టిందని దర్శకుడు తేజ ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రస్తుతం తేజ పుష్ప సినిమాపై చేసిన కామెంట్లు సంచలనానికి దారితీస్తున్నాయి. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ అభిమానులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ విషయం గురించి అల్లు అర్జున్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Nandamuri Balakrishna: మాటల తూటాలు పేల్చిన బాలయ్య.. కర్నూలులో పంచ్ డైలాగ్స్ తో రేంజ్ పెంచాడుగా!

Nandamuri Balakrishna: టీడీపీ సీనియర్ నాయకుడు హిందూపురం ఎంపీ నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఈ యాత్ర కూటమి పార్టీల తరఫున చేస్తున్నారు. యాత్రలో...
- Advertisement -
- Advertisement -