Aparna Balamurali: టాలీవుడ్ ప్రేక్షకులకు అపర్ణ బాలమురళి ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ ఆకాశమే నీ హద్దురా సినిమాలో స్టార్ హీరో సూర్య సరసన హడావిడి చేసిన అమ్మడు అంటే ఎవరైనా ఇట్లే గుర్తుపడతారు. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. యాత్ర తుదరున్ను సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అపర్ణ.
ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించి నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక సూర్య సరసన తమిళం లో సురారై పోట్రూ సినిమాలో హీరోయిన్ గా నటించి వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమానే తెలుగులో ఆకాశమే నీ హద్దురా అని తెలుగు రీమేక్ చేశారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అంతేకాకుండా అపర్ణ ఆడపాదడప కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.
ఇదిలా ఉంటే అపర్ణ బాలమురళి నెట్టింట్లో ఒక రేంజ్ లో ట్రోల్స్ చేయబడుతుంది. తాజాగా ఒక తమిళ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న ఈ అమ్మడు ఒక రేంజ్ లో ఫైర్ అయింది. నేను లావుగా ఉన్నానని కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ఇక కొంతమంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అయితే 27 సంవత్సరాలకే తల్లి పాత్రలు చేయమని అడుగుతున్నారు. అసలు మన బరువుకి, ప్రతిభ కి సంబంధం ఉందా అని అడిగింది. అంతేకాకుండా నాకు తల్లి పాత్రలు చేసే వయసు ఇంకా రాలేదు అని తెలిపింది.
ఇక అనారోగ్య కారణాలవల్ల, ఏదైనా ఇతర కారణాల వల్ల బరువు పెరగొచ్చు తగ్గవచ్చు.. దానికి ప్రతిభకి లింక్ ఏంటని అని అడిగింది. ఇక నేను నా లావుగా ఉన్నప్పటికీ కూడా నన్ను చాలామంది నటిగా అంగీకరిస్తున్నారు అని ఆ ప్రెస్ మీట్ మీడియా ముందుల ఫైర్ అయింది. ప్రస్తుతం అపర్ణ బాలమురళి ను నెటిజన్లు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.