Disaster: ఓటీటీలో జిన్నా మూవీకి వచ్చిన రెస్పాన్స్ ఇదే!

Disaster: టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా వచ్చిన జిన్నా సినిమా థియేటర్లలో అంతగా ప్రేక్షుకులను ఆకట్టుకోలేదు. దీపావళి సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు సినిమా యూనిట్ తీసుకొచ్చింది. కానీ పెద్దగా కలెక్షన్లను ఈ సినిమా రాబట్టలేకపోయింది. అయితే తాజాగా ఈ సినిమాను ఓటీటీలో మేకర్స్ విడుదల చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ శుక్రవారం నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌కు ఉంచింది.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ విడుదల చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో కూడా ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్‌కి ఉంచారు. ఇషాన్ సూర్య ఈ సినిమాకు దర్శకత్వం వహించగా. పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.

ఓటీటీలో కూడా దక్కని ఆదరణ

మంచు మోహన్ బాబు ఈ సినిమాకు స్క్రీన్‌ప్లేతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. కానీ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ రాబట్టుకోవడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారు. అయితే ఓటీటీలో కూడా ఈ సినిమాగా ఆదరణ లభించడం లేదు. దీంతో థియేటర్లో ప్లాప్ అయితే ఓటీటీలో అట్టర్ ప్లాప్ అయిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఓటీటీలో ప్రేక్షకుల నుంచి అసలు రెస్సాన్స్ దక్కడం లేదని చెబుతున్నారు. థియేటర్లలో ఫెయిల్ అవ్వడంతో కనీసం ఓటీటీలో అయినా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందేమోనని మేకర్స్ భావించారు.

కానీ ఓటీటీలో కూడా ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో.. ఈ సినిమాకు పెట్టిన డబ్బులు కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల చిన్న హీరోల సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయని, కానీ జిన్నా మూవీకి పెట్టిన ఖర్చు కూడా వెనక్కి రాలేదని అంటున్నారు. కాగా ఈ సినిమాకు తొలిరోజు రూ.15 లక్షల షేర్ వచ్చింది. ఇంత దారుణమైన ఓపెనింగ్స్ ఇప్పటివరకు ఏ సినిమాకు రాలేదని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Nomination: చంద్రబాబు నాయుడు నామినేషన్.. చరిత్రలో తొలిసారి ఈ విధంగా జరగబోతుందా?

Chandrababu Nomination: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ విజయం అందుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఏడుసార్లు కుప్పం నుంచి పోటీ చేయగా...
- Advertisement -
- Advertisement -