Disco Shanthi: బాలకృష్ణ గారు మాత్రమే మా కోసం ఫోన్ చేశారు.. శాంతి కామెంట్స్ వైరల్?

Disco Shanthi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు శ్రీహరి ఒకరు. ఈయన హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలోనూ అలాగే సహాయ నటుడి పాత్రలలోను ఎంతో అద్భుతంగా నటించారు. అయితే ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీహరి అనారోగ్య సమస్యలతో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈయనలేని లోటు ఇండస్ట్రీలో స్పష్టంగా కనిపిస్తోంది.

శ్రీహరి చనిపోయిన అనంతరం తన భార్య డిస్కో శాంతి తన పిల్లల బాగోగులను చూసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇకపోతే ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.శ్రీహరి గారు నటించిన సినిమాలన్నింటికీ అందరూ కరెక్ట్ గా పేమెంట్ చేసి ఉంటే ఇప్పటికి తాను మరో ఒక పది ఇల్లు కొనేదాన్ని.ఆయనకు సినిమాలంటే చాలా పిచ్చి డబ్బులు ఇవ్వకపోయినా సినిమాలలో నటించేవారు. ఇలా చాలామంది తనకి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని శాంతి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక కొంతమంది మాత్రమే తనకు కరెక్ట్ గా పేమెంట్ ఇచ్చే వాళ్ళని చెప్పిన ఈమె ప్రస్తుతం తాను ఉంటున్న ఇంటి అప్పు చెల్లించడానికి కూడా తన దగ్గర ఉన్న నగలు, కార్లు అన్ని అమ్మేసి అప్పులు చెల్లించామని డిస్కో శాంతి పేర్కొన్నారు. ఇకపోతే శ్రీహరి గారు మరణించిన తర్వాత ఆయన నటించిన సినిమాలు చాలా విడుదలయ్యాయి అయితే ఏ ఒక్కరూ కూడా తమకి ఫోన్ చేసి శ్రీహరి గారు నటించినందుకు బ్యాలెన్స్ పెండింగ్ ఉంది అంటూ మా దగ్గరకు ఎవరు రాలేదు.

నటుడు బాలకృష్ణ మాత్రం తనకు ఫోన్ చేసి శ్రీహరి గారు మరణించే ముందు మా సినిమాలో చేశారు ఆయనకు ఇవ్వాల్సిన పేమెంట్ ఏదైనా బ్యాలెన్స్ ఉంటే చెప్పమ్మా ఇచ్చేస్తామని అడిగారు అలాగే తన నుంచి ఏదైనా సహాయం కావాలన్నా మొహమాట పడకుండా అడగమని బాలకృష్ణ తనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారట ఇలా బాలకృష్ణ మినహా మిగిలిన ఎవరు తనకు ఎలాంటి ఫోన్ చేసి పరామర్శించలేదని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.

Related Articles

ట్రేండింగ్

Janasena: ఏపీలోని 21 అసెంబ్లీ స్థానాలలో జనసేన పరిస్థితి ఇదీ.. అన్ని స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందా?

Janasena: మే 13వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా జనసేన పోటీ చేస్తున్నటువంటి ఈ స్థానాల విషయంలో...
- Advertisement -
- Advertisement -