Divya Bharathi: దివ్యభారతి మరణించిన రోజు అసలేం జరిగిందో తెలుసా?

Divya Bharathi: దివ్యభారతి ఒక భారతీయ నటి. హిందీ, తెలుగు భాషలలో నటించింది. ఆమె తన కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన, అత్యధిక పారితోషకం పొందిన భారతీయ నటీమణులలో ఒకటిగా పరిగణించబడింది. ఈమె తెలుగులో రొమాంటిక్ యాక్షన్ బొబ్బిలి రాజా చిత్రంలో వెంకటేష్ సరసన నటించి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యింది.

ఇక వరుస అవకాశాలతో తెలుగు, హిందీ చిత్రాలలో నటించింది. తనకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ గా ఎదిగి ప్రేక్షకుల మన్ననలు పొందింది. దివ్యభారతి 1992లో దర్శక నిర్మాత సాజిద్ నడియాడ్ వాలాను ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో వివాహం చేసుకున్నారు. ఆమె సినీ కెరీర్ పై ప్రభావం పడకుండా పెళ్లిని రహస్యంగా ఉంచారు.

అసలు విషయానికి వస్తే 1993 ఏప్రిల్ 5వ తేదీ బొంబాయిలోని అంధెరి వెస్ట్ లోని వెర్సోవాలోని తులసి బిల్డింగ్ లోని ఐదవ అంతస్తులో తన బిల్డింగ్ పక్కన ఉన్న కిటికీ నుండి దివ్యభారతి పడిపోయి చనిపోవడం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఆమె అతిధులు నీతా లుల్లా, నీతా భర్త శ్యామ్ లుల్లా, పనిమనిషి అమృత కుమారి ఉన్నారు.

పోలీసులు కేసు ఫైల్ చేసి విచారణలో ఆ రోజు సాయంత్రం అతిధులతో కలిసి మందు తాగి బయటికి నడుచుకుంటూ వచ్చి కిటికి సరిగా లేకపోవడం వల్ల ముందుకు వాలి, కంట్రోల్ తప్పి కింద పడడం జరిగింది. ఆమెను వెంటనే కూపర్ ఆస్పత్రికి తరలించారు అక్కడ ఆమె మరణించడం జరిగింది. ఆమె తనకు బలమైన గాయం అయిందని, అంతర్గత రక్తస్రావం కారణంగా ఆమె మరణించడం జరిగింది అని పేర్కొన్నారు.

1993 ఏప్రిల్ 7న బొంబాయిలోని విలే పార్లే స్మశాన వాటికలో అంతక్రియలు జరిపారు. ఇది జరిగిన నెల రోజులకు పనిమనిషి కూడా గుండెపోటుతో మరణించడం జరిగింది. పోలీసులు కేసు క్లోజ్ చేశారు. దీని వెనక భర్త ఉందని కొందరు, దావూద్ ఇబ్రహీం కూడా ఈ హత్యకు కారణం అనే వార్తలు బాగానే వినిపించాయి. దివ్యభారతి చనిపోయి 30 సంవత్సరాలైనా ఆమె డెత్ మిస్టరీ ఒక వీడని చిక్కు ప్రశ్న లాగా మిగిలిపోయింది.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -