BJP: బీజేపీలోకి టాలీవుడ్ సినీ నటి.. బీజేపీ ఎంపీతో కీలక మంతనాలు

BJP: మునుగోడు ఉపఎన్నిక వేళ తెలంగాణ రాజకీయాల్లో వలసలు మొదలయ్యాయి. ఆపరేషన్ ఆకర్ష్ కు పార్టీలన్నీ పదును పెట్టాయి. నేతలను వరుస పెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారు. గత వారం రోజులగా తెలంగాణలో వలసల పర్వం హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ను ఎవరూ ఊహించని విధంగా బీజేపీలో చేర్చుకోవడంతో టీఆర్ఎస్ అలర్ట్ అయింది. బీజేపీతో పాటు కాంగ్రెస్ లోని నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు వలసలను మరింత పెంచింది. ఇప్పటికే కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ దంపతులతో పాటు బీజేపీ నేత భిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ లు బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిపోయారు.

పలువురు కాంగ్రెస్ ఎంపీలు టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలతో హస్తం పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. కాంగ్రెస్ లో పార్టీ మారే ఎంపీలు ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ కు చెందిన పలువురు కీలక నేతలు కూడా టీఆర్ఎస్ లో చేరుతారని కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో రానున్న రోజుల్లో కాంగ్రెస్ లోని పలువురు కీలక నేతలు కూడా టీఆర్ఎస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి., చాలామంది నేతలు తమతో టచ్ లో ఉన్నారని, త్వరలో చేరుతారంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ఇక బీజేపీ కూడా చేరికలపై మరింత స్పీడ్ పెంచింది. ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి పలువురిని చేర్చుకోగా.. ఇక ఇతర పార్టీల నేతలను కూడా ఆహ్వనిస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ సినీ నటి దివ్యవాణి బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తో ఆమె భేటీ అయ్యరు. దీంతో త్వరలో ఆమె బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో బీజేపీ చేరిక కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను దివ్యవాణి కలిశారు. ఈ సందర్బంగా బీజేపీలో చేరాల్సిందిగా ఆమెను ఈటల ఆహ్వనించారు. ఇప్పుడు ఎంపీ లక్ష్మణ్ ను కలవడంతో త్వరలోనే ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

సినీ గ్లామర్ ను పెంచుకోవడంపై బీజేపీ దృష్టి పెట్టింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్, నితీన్ లను బీజేపీ పెద్దలు కలవడం వెనుక టాలీవుడ్ ను బీజేపీ వైపు ఆకర్షించడమనే వ్యూహం ఉందని ప్రచారం జరిగింది. టాలీవుడ్ లోని నటీనటులను ఆకట్టుకోవడం ద్వారా సినీ గ్లామర్ ను సంపాదించుకోవాలనే దిశగా టీబీజేపీ నేతలు అడుగులు వేస్తోన్నారు. ఇప్పటిక విజయశాంతి, జీవిత రాజశేఖర్ బీజేపీలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వారిద్దరూ పోటీలోకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. ఇప్పుడు దివ్యవాణి కూడా బీజేపీలో చేరితే ఆ పార్టీకి సినీ గ్లామర్ మరింత పెరుగుతుందని కాషాయ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో రాజకీయ వలసలు జోరుుగా సాగుతున్న క్రమంలో ఎంపీ లక్ష్మన్ ను దివ్యవాణి కలవడం చర్చనీయాంశంగా మారింది.

దివ్యవాణి గతంలో తెలుగుదేశం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఏపీ రాజకీయాల్లో ఆమె అడుగుపెట్టారు. కానీ 2019 తర్వాత టీీడీపీ ఏపీలో అధిారంలోకి రాకపోడం, ఆ పార్టీలో ప్రాధాన్యంత దక్కకపోవడంతో గత ఆరు నెలల క్రితం టీడీపీకి రాజీనామా చేశారు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -