Dhamaka: ధమాకాను ఫ్లాప్ చేయాలని బన్నీ, తారక్ ఫ్యాన్స్ భావిస్తున్నారా?

Dhamaka: హిట్‌తో సంబంధం లేకుండా మాస్ మహారాజా రవితేజ వరుసగా సినిమాలు చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ తర్వాత ‘క్రాక్’ సినిమాతో బిగ్ హిట్ అందుకున్న రవితేజ.. ఆ తర్వాత చేసిన ‘ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాలు చేశారు. ఈ సినిమా సక్సెస్ అందుకోలేకపోయాయి. ప్రస్తుతం రవితేజ ‘ధమాకా, వాల్తేరు వీరయ్య’ సినిమాల్లో నటిస్తున్నారు.

 

ఇటీవల ‘ధమాకా’ టీజర్ విడుదల అయింది. ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ‘ధమాకా’ పవర్ ఫుల్ మాస్ సినిమా అని చెప్పుకొస్తున్నారు. ఇందులో రవితేజ ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదనే చెప్పుకోవచ్చు. డ్యాన్స్, డైలాగులతో కుమ్మేశాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల కూడా గ్లామరస్ డోస్ పెంచేసింది. తన అందం, ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. టీజర్ చూసిన రవితేజ ఫ్యాన్స్ మాత్రం ఈ సారి హిట్ కొట్టడం కన్‌ఫర్మ్ అని అనుకుంటున్నారు.

 

నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘ధమాకా’ మూవీ తెరకెక్కింది. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు.. చాలా రోజుల తర్వాత రవితేజ మళ్లీ హిట్ కొట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ చూశాక సినిమానే చూసినట్లుగా అనిపించింది. అయితే ఈ ట్రైలర్‌లోని ఓ డైలాగ్ మాత్రం కాంట్రవర్సీకి దారి తీసింది. దీంతో స్టార్ హీరోలైన ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్ అభిమానులు కావాలనే ఆ డైలాగ్ చెప్పాడని, తమ హీరోలను టార్గెట్ చేశాడని చెప్పుకొస్తున్నారు.

 

ట్రైలర్‌లో రవితేజ.. ‘నేను వెనుక ఉన్న వాళ్లని చూసి ముందుకు వచ్చిన వాడిని కాదురోయ్.. వెనుక ఎవడూ లేకపోయినా ముందుకు వచ్చినోడిని..’ అని అంటాడు. దీంతో ఈ డైలాగ్ కాంట్రవర్సీకి దారి తీసింది. స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ ఈ డైలాగ్ చెప్పుకొచ్చాడని అభిమానులు మండిపడుతున్నారు. అయితే రవితేజకు ఆరు, ఏడు సినిమాలు చేస్తే కానీ హిట్ రాదు. అలాంటిది ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఈ కాంట్రవర్సీలు చేయడం ఏంటని పలువురు ఆరోపిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -