Property Rights of Daughter: ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు ఉంటుందా.. కోర్టు వెల్లడించిన విషయాలివే!

Property Rights of Daughter: సాధారణంగా మన ఇంట్లో ఆడపిల్ల ఉంది అంటే తనని పెద్ద చేసి తనకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. అయితే పెళ్లి చేసే సమయంలో వరుడికి పెద్ద ఎత్తున ఘటన కానుకలు అందజేస్తూ ఉంటారు.ఇలా కట్ట కానుకలను భారీ స్థాయిలో ఇవ్వడమే కాకుండా వారి పెళ్లిను కూడా అంగరంగ వైభవంగా చేస్తారు. ఈ విధంగా ఆడపిల్లకు కట్న కానుకలు ఇస్తే వారికి పుట్టింటితో సంబంధం తెగిపోతుంది తిరిగి పుట్టింటి ఆస్తిపై వారికి ఎలాంటి హక్కు ఉండదని చాలామంది భావిస్తారు.

ఈ క్రమంలోనే పుట్టింటి ఆస్తి గురించి ఆడపిల్ల హక్కుల గురించి ప్రశ్నించడంతో పెళ్లి చేసి కట్న కానుకలు ఇచ్చాము కదా అంటూ సమాధానాలు చెబుతూ ఉంటారు. అయితే ఈ కట్ట కానుకలు ఇవ్వడం ఇప్పటికి ఆనవాయితీగా కొనసాగుతూనే ఉంది.అయితే ఆడపిల్లకు పెళ్లి సమయంలో ఇచ్చే కట్న కానుకలు మాత్రమే ఆస్తినా…తన తండ్రి ఆస్తిలో తనకు ఏ మాత్రం హక్కులు ఉండవా ఆస్తిలో వాటా ఉండదా అని చాలామంది సందేహాలను వ్యక్తం చేస్తుంటారు.

తాజాగా ఈ విషయం గురించి ముంబై కోర్టు సంచలనమైన తీర్పు ప్రకటించింది.ఈ సందర్భంగా కోర్టు ఈ విషయం గురించి తీర్పును తెలియజేస్తూ పెళ్లి సమయంలో కట్లు కానుకలు ఇచ్చారు అనడానికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు అయితే కట్న కానుకలు ఇచ్చినప్పటికీ కూడా తండ్రి ఆస్తి విషయంలో ఆడపిల్లలకు పూర్తి హక్కు ఉంటుందని తీర్పు ప్రకటించారు. ఇలా పెళ్లి తర్వాత కూడా తన తండ్రి ఆస్తిలో తనకు భాగం ఉంటుందని కోర్టు ప్రకటించింది.

అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన తనకు తెలియకుండా ఆస్తిని తన సోదరులు పంచుకున్న అది నేరమేనని కోర్టు తెలియజేసింది. అలాగే కట్నం ఇచ్చారనే కారణంతో ఆడపిల్లకు ఆస్తిలో వాటా లేదని అర్థం కాదని స్పష్టం చేసింది. ఇక తండ్రికి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఆస్తి విషయంలో సమాన హక్కు ఉంటుంది అంటూ ఈ సందర్భంగా కోర్టు తీర్పు వెల్లడించింది. తెరెజిన్హా మార్టిన్స్ డేవిడ్ VS మిగ్యూల్ గార్డా రొసారియో మార్టిన్స్ అండ్ అదర్స్ కేసులో భాగంగా ముంబై కోర్ట్ ఈ తీర్పును వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

TV Channels: టీవీ9, ఎన్టీవీ నంబర్ 1 కొట్లాట.. ఏది టాప్ అంటే?

TV Channels: తెలుగు న్యూస్ ఛానల్ మధ్య నెంబర్ గేమ్ నడుస్తుంది. పలు న్యూస్ ఛానల్ మేము నెంబర్ వన్ అంటే మేము నెంబర్ వన్ అని కొట్లాడుకుంటున్నారు. తెలుగు న్యూస్ చానల్స్...
- Advertisement -
- Advertisement -