Relationship: పురుషులు ఇలా చేస్తున్నారా.. అయితే పిల్లలు పుట్టడం కష్టమే?

Relationship: పూర్వకాలంలో దంపతులకు నలుగురు ఐదుగురు ఆరుగురు సంతానం కూడా ఉండేవారు. అంతకుమించి ఎక్కువగా ఉన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ రాను రాను ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుత రోజుల్లో అయితే ఒకరు ఇద్దరు పిల్లలను కనడానికి నానా కష్టాలు పడుతున్నారు. కొందరికి పిల్లలు పుట్టే అవకాశం ఉన్న ఒకరు ఇద్దరు తోనే చాలు అనుకుంటున్నారు. ఒకప్పుడు సంతానోత్పత్తి శాతం 90 శాతం ఉండగా ప్రస్తుత రోజుల్లో సంతానోత్పత్తి శాతం కాస్త 45 లేదా 50కి పడిపోయింది. అందుకు కారణం టెక్నాలజీ డెవలప్ అవ్వడం.

ప్రస్తుత రోజుల్లో పిల్లలు పుట్టడం లేదు అని హాస్పిటల్స్ చుట్టూ, గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అయినప్పటికీ లాభం లేకపోయేసరికి కొంతమంది పిల్లలపై ఉన్న ప్రేమతో దత్తత తీసుకోవడం లేదంటే సరోగసిని ఆశ్రయించడం లాంటివి చేస్తున్నారు. అయితే ఎటువంటి అనాలంటే సమస్యలు లేకపోయినా కూడా పిల్లలు ఎందుకు కలగరు?స్త్రీ లోపమా లేక పురుష లోపమా ఇలాంటి అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతూ ఉంటాయి? ఈ ప్రశ్నల పై స్పందించిన నిపుణులు మనం తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్లు అలవాట్ల వల్ల సంసార జీవితం పూర్తిగా నాశనం అవుతుంది అంటున్నారు.

 

భార్యాభర్తల మధ్య జరిగే రతిక్రీడ కూడా గర్భం దాల్చకుండా చేస్తాయంటే ఆశ్చర్యపోక తప్పదు. సాధారణంగా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని చెబుతూ ఉంటారు. కానీ అదే వ్యాయామం పిల్లలు కలగకుండా చేస్తుందట. చాలా మంది స్త్రీలు నాజుకుగా కనిపించాలనే తపతో సాధారణ బరువు ఉన్న కూడా జిమ్ లు, ఫిట్ నెస్ సెంటర్ ల చుట్టూ తిరుగుతున్నారు.
సాధారణ బరువు ఉన్న ఓ స్త్రీ వారానికి అయిదు గంటలకు మించి వ్యాయామం చేస్తే సంతానం కలగడం ఆలస్యమవుతుంది..శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉన్నా సరే, పిల్లలు ఆలస్యంగా పుట్టే అవకాశం ఉంది.

 

పురుషుల విషయానికి వస్తే… వ్యాయామం చేసే సమయం ఎక్కువగా ఉంటేనే మంచిది..వారానికి కనీసం 15 గంటల పాటు జిమ్‌లో కష్టపడే వారిలో వీర్యకణాల వృద్ధి 73 శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక టీవీలు చూడని వారు ఎవరుంటారు. టీవీలు కాకపోతే ఫోన్లు చూస్తూనే ఉంటారు. అయితే… ఎక్కువ సమయం ఒకే చోట కూర్చొని టీవీలు చూసేవారిలో ఈ సమస్య తలెత్తవచ్చు. వారానికి 20 గంటలకు మించి టీవీల ముందు కూర్చునే పురుషుల్లో వీర్యకణాల వృద్ధి తగ్గిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు సెల్ ఫోన్లు టీవీలను ల్యాప్టాప్ లను అవాయిడ్ చేయడం మంచిది. మాంసహారం ఎక్కువగా తినే పురుషుల్లోనూ సంతానసమస్య తలెత్తుంది. రోస్టెడ్ చికెన్, ఎగ్స్ తినేవారికి అటువంటి సమస్యలు రావు. ఇవి కాకుండా ఇతర మాంసాహారాలు తినేవారిలోనే వీర్యకణాల సంఖ్య తగ్గిపోతోంది.

 

వాటికి బదులు కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. సంతానోత్పత్తికి శృంగారం ఎంత ముఖ్యమో వేరుగా చెప్పనక్కర్లేదు. కానీ ఉద్యోగం, డబ్బు, ఫ్రెండ్స్‌, పార్టీలు అంటూ బిజీ అయిపోయి శృంగారజీవితాన్ని మర్చిపోతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. వారానికి రెండు వారాలకోసారి తూతూమంత్రంగా శృంగారంలో పాల్గొంటూ మమ అనిపిస్తున్నారు. అలాంటివారే ఎక్కువగా సంతాన సాఫల్య కేంద్రాల ముందు నిలబడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారానికి కనీసం మూడు సార్లు శృంగారంలో పాల్గొంటున్నారంటే, వారి వైవాహిక జీవితం బాగానే ఉన్నట్లు చెప్పవచ్చు. అలాగే స్మోకింగ్ డ్రింకింగ్ చేసేవారిలో కూడా సంతానోత్పత్తి సమస్యలు తక్కువగా ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో గుప్త నిధుల కొరకు తవ్వకాలు.. ఈ ఆరోపణలపై వైసీపీ స్పందిస్తుందా?

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ దొంగలించారు. ఐదేళ్ల క్రితం వచ్చిన ఈ ఆరోపణలను ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే టీటీడీ అప్పటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గత ప్రభుత్వంపై చేసిన...
- Advertisement -
- Advertisement -