Vastu: ఇంట్లో ఆ దిశగా దీపం అస్సలు పెట్టకండి?

Vastu: సాధారణంగా మనలో చాలామంది దీపారాధన చేసే విషయంలో కొన్ని రకాల పనులు తులసి తెలియక చేస్తూ ఉంటారు. దానివల్ల పూజ చేసిన ఫలితం దక్కకపోగా మరిన్ని కష్టాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీపం ఏ విధంగా వెలిగించాలి? ఎన్ని వత్తులతో వెలిగించాలి? ఏ దిశగా వెలిగించాలి?ఇలా అనేక రకాల సందేహాలు నెలకొంటూ ఉంటాయి. ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనం దీపారాధన చేసే సమయంలో ఎప్పుడూ కూడా దీపాన్ని దేవునికి ఎదురుగా కుడిపక్కకు అంటే మన కుడిపక్కకు లేదా దేవుని మంటపంలో ఆగ్నేయ భాగంలో పెట్టాలి.

చిన్నపాటి బుడ్డ వత్తులు వెలిగించడం వల్ల ఇంకా మంచిది. రెండు దీపాలు పెడితే ఒకదానిని మరొకటి చూసే విధంగా పెట్టాలి. అనగా దీపం తూర్పు లేదా ఉత్తరం లేదా పశ్చిమం చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి.తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే ఈతిబాధలు, గ్రహ బాధలు, ధు:ఖాలు తొలగిపోతాయి. పడమటి వైపు ముఖం దీపం వెలిగిస్తే ఋణ బాధలు తొలగిపోతాయి. శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే సరిసంపదలు కలుగుతాయి. విద్యకు, వివాహానికి అటంకాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అలాగే దక్షిణముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై, దు:ఖబాధలు కలుగుతాయి.

 

నాలుగు పక్కలా నాలుగు దీపాలు పెడితే మరీ శ్రేష్ఠం. కాగా ఎన్ని వత్తులు వేయాలి అన్న విషయానికి వస్తే.. ఒక్కటి కాకుండా ఎన్ని వేసినా మంచిదే అని అంటారు పెద్దలు. అలాగే చాలా మంది దీపారాధ‌న చేసేముందు వ‌త్తి వేసి త‌ర్వాత నూనె పోస్తుంటారు. కానీ ఇది సరైన ప‌ద్ధ‌తి కాదు. దీపారాధ‌న చేసేట‌ప్పుడు నూనె పోసి త‌ర్వాత వ‌త్తులు వేయాలి.వెండి కుందులు, పంచ లోహ కుందులు, ఇత్త‌డి కుందులు మంచివి. స్టీలు కుందుల్లో దీపారాధ‌న చేయ‌కూడ‌దు. కుందుల‌ను రోజూ శుభ్రంగా క‌డిగిన త‌ర్వాతే ఉయోగించాలి. శుభ్ర‌ప‌ర‌చ‌కుండా వ‌త్తులను మార్చ‌డం ప‌ద్ధ‌తి కాదు.

ఏ ప్రమిదలో దీపారాధన చేసినా, ఆ ప్రమిద కింద చిన్న పళ్లేన్ని లేదా ఆకుని ఉంచాలి. మూడు వత్తులతో దీపారాధన చేయడం వలన సంతాన లాభం కలుగుతుంది. అయిదు వత్తులతో దీపారాధన చేయడం వలన సంపదలు చేకూరతాయి. తొమ్మిది వత్తులతో దీపారాధన చేయడం వలన కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.

 

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnamraju: రఘురామ కృష్ణంరాజు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా.. ఏ దిక్కు లేకపోతే అ పార్టీనే దిక్కవుతుందా?

Raghurama Krishnamraju: ఏపీలో రఘురామకృష్ణం రాజు ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్నారు. నిజానికి గత నాలుగేళ్లు ఏపీ రాజకీయాల్లో ఆయన ట్రెండ్ అవుతూనే ఉన్నారు. వైసీపీ ఎంపీల పేర్లు గుర్తు...
- Advertisement -
- Advertisement -