Dogs: పెట్‌డాగ్స్‌ పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

Dogs: దాదాపుగా చాలా మంది ఇళ్లలో వివిధ రకాల జంతువులు, పక్షులను పెంచుకుంటుంటారు. వాటిని తమ పిల్లలతో సమానంగా భావించి జాగ్రత్తలు పాటిస్తున్నారు. అయితే.. కుక్కలను మాత్రం అన్నింటికన్నా మరింతా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇళ్లలో పెంచుకునే పెట్‌ డాగ్స్‌పై చూపే ప్రేమ మామూలుగా ఉండదు. అలాంటి పెట్‌ డాగ్‌ పొరపాటునా అంధత్వానికి గురైతే ఆ బాధ చెప్పుకోనంత ఉంటుంది. అలాంటి సందర్భం వస్తే వాటిని ఎలా చూసుకోవాలో పశువైద్యులు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు. కుక్కలలో అంధత్వం అనేది వయసు రీత్యా లేదా వ్యాధి కారణంగా వస్తోంది. అటువంటి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం ఒక సవాల్‌గా మారుతోంది. కానీ.. ఇలాంటి కుక్కలను మిగతా వాటి కన్నా మరింతా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇంట్లో పెట్‌ ఇంట్లో స్వేచ్ఛగా సంచరించేలా సురక్షితమైన స్థలాన్ని ఏర్పాటు చేయడం చాలా కీలకం. ఇవి వాటికి సంభవించే ప్రమాదం నుంచి సంరక్షిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

 

బేబీ ప్రూఫింగ్‌..
ఇంట్లో పెంపుడు కుక్కను పెంచుకుంటున్నట్లైతే బేబీ ప్రూఫింగ్‌ చేయాల్సిందే. అలా చేస్తే మీ పెట్‌ ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతుంది. బేబీ ప్రూఫింగ్‌æ అంటే.. పదునైన మీ ఇంటి మూలలను మొత్తటి స్పాంజ్‌లతో కప్పేయాలి. జారిపడే అవకాశం ఉండే మెట్ల వంటి ప్రదేశాలలో గేట్లను ఏర్పాటు చేయాలి. ప్రమాదకరమైన వస్తువులు, ఆయుధాలు మీ పెట్‌ సంచరించే ప్రదేశాల్లో ఉంచకుండా జాగ్రత్త వహించాలి బేబీ ప్రూíఫింగ్‌ ద్వారా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

శబ్దా సందేశాలతో..
ఇంట్లోని నిర్ణీత ప్రదేశంలో రేడియో లేదా స్పీకర్లు ఉంచినట్లైతే అవి బ్లైండ్‌ పెట్స్‌ కు సూచికగా ఉపయోగపడతాయి. మీరు బయటకు వెళ్లినప్పుడు వాటికి సరైన మార్గ దిశానిర్దేశం చేస్తుంది. సోఫా, బెడ్‌ పై కూడా పెట్స్‌ ను అనుమతిస్తే వాటి విశ్వాసం మరింత పెరిగి ఫ్రీగా సంచరించగలుగుతాయి. మీకు బంగ్లా, కాంపౌండ్‌ లో కంచెలు వేయడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. పాక్షిక అందత్వం కలిగిన పెట్స్‌ ఉంటే ఇంటిలో రంగు రంగుల లైటింగ్‌ వేయడం చేయకూడదు. కొన్ని వాయిస్‌ సందేశాలను రూపొందించి మీ పెట్స్‌ ఆదేశాలను పాటించేలా శిక్షణ ఇస్తే ఉత్తమం.

లేఅవుట్‌లను మార్చొద్దు..
ఇంట్లో ఫర్నిచర్, వస్తువులను తరచుగా మార్చరాదు. మీ బ్లైండ్‌ పెట్‌ తన మనస్సులో ఒక మ్యాప్‌ను ఫిక్స్‌ చేసుకుని ఉంటుంది. దాని ఆధారంగానే అది ఇంట్లో తిరుగుతుంది. మీ ఇంటిలో మీరు చేసే చిన్న మార్పు కూడా వాటిని గందరగోళానికి గురి చేస్తుంది. కాబట్టి.. లేఅవుట్లను ఎప్పుడంటే అప్పుడు మార్చకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. మార్పులు చేయకపోవడం ఉత్తమం.
వస్తువులన్నీ క్రమపద్ధతిలో ఉంచేలా.. సాధారణంగా చాలా ఇళ్లలో వస్తువులను ఒక క్రమపద్ధతిలో ఉంచకుండా చెల్లాచెదురుగా పడేస్తూ ఉంటారు. షూస్‌ ను ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం, వస్తువులను చెల్లాచెదురుగా పడేయడం చేస్తూ ఉంటారు. ఇలాంటి అలవాట్లను మానుకోవాలి. ఈ అలవాట్లు మీ పెట్‌ ను గందరగోళానికి గురిచేస్తాయి.

విభిన్నమైన ఫ్లోర్‌ తివాచీలు..
సాధారణంగా మనుషులలో మాదిరే బ్లైండ్‌ పెట్స్‌ లో కూడా ఒక ఇంద్రియం కోల్పోయినప్పుడు ఇతర ఇంద్రియాలు యాక్టివేట్‌ అవుతాయి. బ్లైండ్‌ పెట్‌ లలో వాటి పాదాలు మరింత సున్నితంగా తయారవుతాయి. పాదాల స్పర్శతోనే అవి ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నాయో గుర్తించగలుగుతాయి. వేర్వేరు గదులలో వేర్వేరు తివాచీలను ఉపయోగించడం వల్ల మీ పెట్‌ డాగ్‌ గదుల మధ్య తేడాను గుర్తించగలుగుతాయి.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -