Balayya: ఆ హీరోయిన్లకు బాలయ్యతో నటించడం ఇష్టం లేదా?

Balayya: నటసింహ బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు ఈతరం కుర్ర హీరోలతో సైతం పోటీపడుతున్నాయి. అటు సినిమాలు, ఇటు రాజకీయాలను బాలయ్య బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే బాలయ్యతో నటించేందుకు పలువురు హీరోయిన్లు మాత్రం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. బాలయ్య ఎక్కువగా యాక్షన్, ఫ్యామిలీ, ఫ్యాక్షన్ సినిమాల్లో నటిస్తారు. ఆయన సినిమాల్లో ఈ మధ్య ఎక్కువగా కుర్ర హీరోయిన్లే కనిపిస్తున్నారు. తాజాగా బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

 

సంక్రాంతి కానుకగా బాలయ్య సినిమా విడుదల కానుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా వచ్చే నెలలో థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం బాలయ్య అనీల్ రావిపూడి దర్శతకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంపై వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య మార్క్ యాక్షన్ తో పాటుగా అనీల్ మార్క్ వినోదం కూాడా ఉండనుంది. ఈ సినిమాలో బాలయ్యకి ప్రతినాయకుడిగా బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ ని దింపుతున్నట్లు సమాాచారం.

 

ఇకపోతే అనీల్ సినిమాలో బాలయ్యకి జోడీగా ఎంపిక చేసే హీరోయిన్ విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. సీనియర్ హీరోయిన్ల నుంచి కొత్త భామల వరకూ కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా బాలీవుడ్ నుంచి హీరోయిన్ ను తీసుకురావాలని ఆలోచిస్తున్నారు.

 

ఇదిలా ఉంటే టాలీవుడ్ బాలయ్యతో చాలా మంది హీరోయిన్లు నటించారు. కానీ ఇద్దరు హీరోయిన్లు మాత్రం బాలయ్యతో నటించడానికి ఆసక్తి చూపడం లేదు. కాజల్, తమన్నా బాలయ్యకు జోడీగా నటించడానికి పలు సందర్భాల్లో ఆఫర్లు వచ్చినా వారు రిజెక్ట్ చేసినట్లు సమాచారం. అయితే బాలయ్యకు జోడీగా కాజల్, తమన్నా ఇద్దరూ సెట్ అవుతారు. ఈ ఇద్దరు హీరోయిన్లతో రాబోయే రోజుల్లో అయినా బాలయ్య కలిసి నటిస్తారేమోనని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -