500 Notes: మీ దగ్గర 500 నోట్లు ఉన్నాయా.. ఈ తప్పులు చేస్తే నష్టమే!

500 Notes: ఇటీవల దేశవ్యాప్తంగా రూ.2 వేల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నోటు ఉపసంహరణ ప్రభావం చాలా తక్కువగానే ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ నోట్లు ఉన్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ 2 వేల నోట్లు ఉన్నవారు మాత్రం మార్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే ప్రజలు నోటు మార్పిడి విషయంలో తలలు పట్టుకుంటుండగా ఇప్పుడు రూ. ఐదు వందల నోటు విషయంలోనూ ఆర్బీఐ చేసిన ఒక ప్రకటన రూ.500 నోటుని కూడా రద్దు చేస్తారేమోనన్న అనుమానాలు రేకిస్తున్నాయి.

రూ.2000 నోట్ల‌తో పోలిస్తే రూ.500 డినామినేష‌న్‌ కు చెందిన న‌కిలీ నోట్లే ఎక్కువ‌గా స‌ర్క్యులేష‌న్‌లో ఉన్న‌ట్లు ఆర్బీఐ వెల్ల‌డించింది. 2022-23 సీజ‌న్‌లో రూ.500 డినామినేష‌న్‌కు చెందిన 14.4 శాతం న‌కిలీ నోట్ల‌ను గుర్తించిన‌ట్లు ఆర్బీఐ తెలిపింది. గ‌త ఏడాది రూ.500కు చెందిన 91,110 నోట్ల‌ను గుర్తించిన‌ట్లు ఒక నివేదిక‌లో పేర్కొంది. అర్బీఐ ప్రకటన ప్రకారం చూస్తే రూ. ఐదు వందల నోట్ల నకిలీలు అసాధారణ స్థాయిలో ఉన్నాయని చెప్పక తప్పదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

 

దొంగ నోట్లు ఏవో మంచి నోట్లు ఏవో గుర్తు పట్టలేని విధంగా సెక్యూరిటీ ఫీచర్లను కూడా యాజిటీజ్ దించేసి మరీ ఫేక్ నోట్స్ తయారు చేస్తున్నారని వెబ్ సిరీస్‌లు తీస్తున్నారు. ఆ వెబ్ సీరిస్‌లలో వచ్చేది నిజమేనని ఆర్బీఐ నివేదికను బట్టి వెల్లడవుతోందని అంటున్నారు. గతంలోలా నోట్లను రద్దు చేస్తే గందరగోళం ఏర్పడుతుందని కేంద్రం వ్యూహాత్మకంగా ముందుగా రెండు వేల నోటును ఉపసంహరించుకున్నారని అంటున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఐదు వందల నోట్లను కూడా ఉపసంహరించుకునే అవకాశం ఉందన్న ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. అత్యధిక రాజకీయ అవినీతి నోట్ల ద్వారానే జరుగుతోంది. ఎన్నికల సమయంలో ఖర్చుల కోసం నోట్లు దాచి పెడుతున్నారు. అలాంటి వారికి షాకిచ్చేందుకు బీజేపీ ప్రభుత్వ రెడీగా చెబుతున్నారు. .

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -