Spirituality: ఇంట్లో లక్ష్మీదేవి కృష్ణుడు ఫోటోలు ఉన్నాయా?

Spirituality: సాధారణంగా మనం ఇంట్లో ఎన్నో రకాల దేవుడి ఫోటోలు పెట్టుకుంటూ ఉంటాము. అయితే మన ఇంట్లో కొన్ని రకాల దేవుడి ఫోటోలు పెట్టుకోవచ్చు మరికొన్ని పెట్టుకోకూడదు అంటున్నారు పడితులు. మరి మనం ఇంట్లో ఎటువంటి ఫొటోలు ఉండాలి. ఎటువంటి ఫొటోస్ ఉండకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు. ఎందుకంటె సూర్యనారాయణుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు కాబట్టి నేరుగా నమస్కరించుకోవాలి. అలాగే పూజగది విడిగా లేని వారు పంచముఖ ఆంజనేయుడి ఫొటో పెట్టకూడదు.

ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో గాని విగ్రహం కానీ ఉంచకూడదు. లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టికుని పూజ చేయవచ్చు. అలాగే చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదు. కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉన్న ఫొటో గాని చిన్న పరిమాణంలో ఉన్న విగ్రహం కానీ పెట్టుకోవచ్చు. అదేవిధంగా లక్ష్మీ దేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి. ఇంట్లో విగ్రహాలు పెట్టేవారు వారి పరిమితి చిన్నగా ఉండేలా చూసుకోవాలి. విగ్రహాలు పెద్దగా ఉంటే వాటికి మహానివేదన ఇవ్వాల్సి ఉంటుంది.

 

అభిషేకం, పూజ లేకుండా ఉండకూడదు. ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం అస్సలు పెట్టుకోకూడదు. నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్క ఉండవచ్చు. ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు. నిత్యం పూజలో ఉన్న విగ్రహాలు పూజ గది నుంచి తీసి వేయాల్సి వస్తే గుడిలో పెట్టాలి.
ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండం ఎడమ వైపు ఉండాలి.

 

విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో ఉండే విగ్రహానికి తొండం కుడివైపు ఉండాలి. వ్యాపారం చేసే ప్రాంతంలో నిల్చున్న వినాయకుడు ఉండాలి. ఇంట్లో ఉంటే ఫొటోస్ లో ఎక్కడ కూడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు, లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతో అటూ ఇటూ ఏనుగులు ఉన్న ఫొటోకి గృహస్థులు పూజించడం చాలా మంచిది. పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజైన వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకు దేవుడు అనుగ్రహాన్ని ప్రసాదం రూపంలో స్వీకరించాలి. పూజ గదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచినా, పూజ గదిలో గోడకు పసుపు రాసి పసుపు మధ్యలో గౌరీ కుంకుమ పెట్టాలి.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -