Devotional: ఐశ్వర్యం కావాలంటే ఈ రెండు వస్తువులను దానం చేయాల్సిందే?

Devotional: సాధారణంగా ఇంట్లోని పెద్దవారు అలాగే పండితులు అనాధలకు ఏమీ లేని వారికి మనకు ఉన్నంతలో కొంచెం దానం చేయమని చెబుతూ ఉంటారు. ఈ విధంగా మనకు తోచిన విధంగా సహాయం చేయడం వల్ల పుణ్యం లభించడంతో పాటు దైవానుగ్రహం కూడా లభిస్తుంది. ఎందుకంటే మీకు ఉన్నదాంట్లో ఎవరికైనా కొద్దిగా దానంగా ఇస్తే అది మనల్ని మరింత ధనవంతులుగా మార్చేస్తుంది. ఈ మాట మేము చెబుతున్న విషయం కాదండోయ్ పండితులే చెబుతున్నారు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అని అంటూ ఉంటారు. అన్నదానంతో పాటు వస్తు, ధన, ధాన్య ఇలా ఎన్నో రకాల దానాలు ఉన్నాయి.

 

అయితే మనం చేసే కొన్ని రకాల దానాలు వల్ల మన ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగవుతాయి. మరి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచి సిరిసంపదలను పెంచే ఆ దానాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సిరి సంపదలతో జీవించాలి అంటే కచ్చితంగా రెండు రకాల వస్తువులను దానం చేయాల్సిందే. అందులో మొదటిది ఇత్తడి వస్తువులు. ఇత్తడి వస్తువులను మీరు ఎవరికైనా దానం ఇవ్వాలి అనుకుంటే అప్పుడు పౌర్ణమి రోజు దానం చేయడం మంచిది. పేదవాళ్లకు ఇత్తడి వస్తువులను దానం చేయడం చాలా మంచిది. ఇలా చేస్తే మీ ఇంట్లో సంపదకు, ఆహారానికి ఎలాంటి లోటు ఉండదు. రెండవ వస్తువు వెండి నాణేలు.

వెండి నాణేలను కూడా పేదలకు పౌర్ణమి రోజున దానం చేస్తే మంచిది. ఆ రోజు బిక్షాటన చేస్తున్న వారికీ వెండి నాణేలను దానంగా ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. అలా చేయడం వల్ల చాలా సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా లవంగాలు ఇవ్వడం వల్ల కూడా మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అయితే మీరు దానం ఇచ్చే వస్తువులపై కొన్ని లవంగాలు ఉంచాలి. ఇలా ఉంచి ఇవ్వడం వల్ల మీకు సంపద వస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -