Relationship: ప్రెగ్నెన్సీ సెక్స్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.. లేదంటే?

Relationship: సాధారణంగా చాలామంది భార్యాభర్తలు ప్రెగ్నెన్సీ సమయంలో కలయికలో పాల్గొన్న వచ్చా లేదా? కలయికలో పాల్గొంటే ఏమైనా ప్రమాదం జరుగుతుందా? సిక్స్ లో పాల్గొంటే కడుపులోని బిడ్డకు ఏమైనా ప్రమాదం జరుగుతుందా? ఇలా అనేక అనుమానాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. అయితే చాలామంది భార్యాభర్తలు ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్ లో పాల్గొనవచ్చా లేదా. పాల్గొంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రెగ్నెన్సీ సమయంలో భార్య భర్తల మధ్య ఎడబాటు తప్పదు అన్న విషయం తెలిసిందే. కానీ చాలామంది భాగస్వామి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా కలిస్తూ ఉంటారు. స్త్రీ ఆరోగ్యం బాగుంటే 8వ నెల వరకు శృంగారంలో పాల్గొనవచ్చు.

అయితే కొందరు గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని నెలల వరకు కలిస్తే ఇంకొందరు గర్భవతి అని తెలియగానే దూరంగా ఉంటారు. ప్రెగ్నెన్సీ వల్ల శృంగార వాంఛలను కలిగించే హార్మోన్లలో తేడా వస్తుంది. శరీరంలో జరిగే రసాయన మార్పులు స్త్రీలను ప్రసవానికి సిద్ధం చేస్తాయి. ఇదే సమయంలో తాము తల్లి కాబోతున్నామన్న భావన మహిళల్లో కొత్త ఆశలను రేకెత్తించి, లైంగిక వాంఛలను తగ్గిస్తాయి. అయితే పురుషుల్లో ఇలాంటి మార్పులేమీ ఉండవు. తండ్రి కాబోతున్నామన్న శారీరక, మానసిక పరమైన అవగాహన పురుషులు స్వయంగా పెంచుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా శృంగార వాంఛలు ఉంటాయి. ఇటువంటి సమయంలో గర్భిణీగా ఉన్న భార్యను శృంగారానికి బలవంతపెట్టడం సరికాదు. కాకపోతే తనకు కలుగుతున్న కోరికల గురించి భార్యకు సున్నితంగా నొక్కి చెప్పాల్సి ఉంటుంది.

 

ఈ సమయంలో గర్బిణీలకు లైంగిక వాంఛలు అంత బలంగా కలగవు. కానీ వారు తమ భాగస్వామి నుండి వెచ్చటి కౌగిలిని, తీయటి ముద్దును కోరుకుంటారు. పాంపరింగ్ ను ఇష్టపడతారు. ఇలాంటి సమయంలో ఆమెకు కూడా శృంగార కోరికలు కలిగితే సెక్స్ లో పాల్గొనొచ్చు. అయితే కొన్ని రకాల పొజిషన్లలో మాత్రమే సెక్స్ చేయాల్సి ఉంటుంది. అయితే గర్భం దాల్చిన ఆరు నుండి పన్నెండు వారాల్లో శృంగారంలో పాల్గొనకపోవడమే మంచిది. దీనివల్ల మిస్ క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రసవానికి రెండు నెలల ముందు నుండే సెక్స్ కు దూరంగా ఉండడం మంచిది. ఈ సమయంలో కలవడం వల్ల అమ్నియోటిక్ ఫ్లూయిడ్స్ లీక్ అయి ప్రమాదానికి దారి తీయవచ్చు. ఆ సమయంలో స్పూన్ పొజిషన్ కూడా మంచిదే. స్త్రీ, పురుషులు ఒకరి వెనుక ఒకరుంది. వారి కాళ్లు పైకి ఉంటాయి. అందుకే దీన్ని స్పూన్ భంగిమ అంటారు. ఈ భంగిమలో ఎవరిమీదీ ఒత్తిడి పడదు కాబట్టి ఇది చాలా జెంటిల్ పొజిషన్ అంటారు. నాలుగు నుండి ఏడో నెల వరకు కలయికలో ఎలాంటి అభ్యంతరాలూ లేవు.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: ఆస్తుల కోసం షర్మిల కోర్టుకు వెళ్తుందా.. తండ్రి ఆస్తులను జగన్ ఇచ్చే ఛాన్స్ లేదా?

YS Sharmila: వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ గత కొంతకాలంగా తన సోదరి వైఎస్ షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య ఎందుకు...
- Advertisement -
- Advertisement -