Free Oxen: రైతులు, కూలీలకు కాడెద్దులు ఫ్రీగా ఇచ్చే ప్లేస్ ఏంటో మీకు తెలుసా?

Free Oxen: ప్రస్తుత కాలంలో వ్యవసాయం చేయాలి అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నదని చెప్పాలి. ప్రతి ఒక్క రైతు కుటుంబంలోనూ ఎద్దులు ఉండేవి అయితే ప్రస్తుత కాలంలో ఎద్దులకు సరైన పశుగ్రాసం లేక ఎద్దులను అమ్మే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా ఎద్దులను అమ్మేసి ట్రాక్టర్ల ద్వారా వ్యవసాయ పనులు చేయాలి అంటే పెరుగుతున్న డీజిల్ పెట్రోల్ ధరలు చూసి చాలామంది వ్యవసాయమే మానేసి కూలీలుగా మారుతున్నారు. ఇలా రోజురోజుకు వ్యవసాయం చేసే వారి సంఖ్య కూడా తగ్గిపోయిందని చెప్పాలి.

అయితే వ్యవసాయం చేసే రైతులకు వ్యవసాయం చేయడానికి ఎద్దులను ఉచితంగా పంపిణీ చేస్తూ రైతులకు చేదోడు వాదోడుగా నిలబడటమే కాకుండా వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు.మరి ఉచితంగా రైతులకు ఎక్కడ ఎద్దులను ఫ్రీగా ఇస్తున్నారు అలా ఇవ్వడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. ఇలా రైతులకు ఉచితంగా ఎద్దులను పంపిణీ చేస్తూ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ హైదరాబాదులోని ఒక సంస్థ కాడెద్దులను ఉచితంగా ఇస్తున్నారు.

 

రైతులకే కాకుండా భూమి లేనటువంటి కూలీలకు కూడాఎద్దులను ఉచితంగా ఇచ్చి వాటితో వ్యవసాయం చేసుకుంటూ స్వయం ఉపాధి పొందేలా ఈ సమస్త రైతులకు అండగా నిలుస్తున్నారు. హైదరాబాద్ జిజియాగూడలో ఉన్నటువంటి శ్రీ సమరత్ కామధేను గోశాల రైతులకు ఉచితంగా ఎద్దులను పంపిణీ చేస్తున్నారు. ఎద్దులను ఉచితంగా పంపిణీ చేయడంతో రైతులకు కూడా వ్యవసాయంపై మక్కువ చూపిస్తూ వ్యవసాయం చేస్తూ స్వయం ఉపాధిని పొందుతున్నారని చెప్పాలి.

 

Related Articles

ట్రేండింగ్

Nandamuri Balakrishna: మాటల తూటాలు పేల్చిన బాలయ్య.. కర్నూలులో పంచ్ డైలాగ్స్ తో రేంజ్ పెంచాడుగా!

Nandamuri Balakrishna: టీడీపీ సీనియర్ నాయకుడు హిందూపురం ఎంపీ నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఈ యాత్ర కూటమి పార్టీల తరఫున చేస్తున్నారు. యాత్రలో...
- Advertisement -
- Advertisement -