Tarak: తారక్ కు ఎంతో ఇష్టమైన ఈ బిర్యానీ గురించి తెలుసా?

Tarak: సినీ ఇండస్ట్రీలో భోజన ప్రియులు చాలా మందే ఉన్నారు. అందులో కొందరి టేస్ట్ అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటారు. కొన్ని కొన్ని ఇంటర్వ్యూలలో సెలబ్రిటీలు చెప్పే వంటకాలు రుచి చూడాలని అందరూ అనుకుంటారు. అలా ఎన్టీఆర్ కూడా తనకు నచ్చిన బిర్యానీ ఏంటో చెప్పాడు. గంగూరు పాక బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టమని తారక్ చెబుతుంటాడు.

 

బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం. అందులోనూ చికెన్ బిర్యానీ అంటే తినవాళ్లు చాలా మంది ఉంటారు. ఫుడ్ లవర్స్ కు ఈ బిర్యానీలు అంటే తెగ ఇష్టం. అయితే అన్ని బిర్యానీలు ఒకేలా ఉండవు కదా. అందులోనూ గంగూరు పాక బిర్యాని స్పెషాలిటీ వేరు. తారక్ మెచ్చిన ఈ బిర్యానీ గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఇంతకీ పాక బిర్యానీ ఏంటి? అక్కడ స్పెషల్ ఏంటి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. విజయవాడ , మచిలీపట్నం జాతీయ రహదారిపై గంగూరు గ్రామంలో హైవే ప్రక్కన ఉన్న జహెర్ షరీఫ్ గంగూరు పాక బిర్యాని హోటల్‌ అంటే తెలియని వారు ఉండరనుకోండి. 1982 ఏప్రిల్‌లో హజి సాహెబ్ అనే వ్యక్తి గంగూరులో చిన్న పాకలో బిర్యాని చేయడం ప్రారంభించారు.

 

ఆ స్పెషల్‌ బిర్యానికి ప్రజలు ఫిదా అయిపోయారు. ఫారం కోడితో ఈ గంగూరు పాక బిర్యానీని చేస్తారు. కొత్త రెసిపీని ఫుడ్ లవర్స్ ఇష్టపడ్డం మొదలెట్టారు. ఈ గంగూరు పాక బిర్యానీలో మంచి పౌష్టిక విలువలు కూడా ఉన్నాయి. బిర్యానీ తయారు చేయడానికి మాత్రం ఇక్కడ పాత పద్ధతులనే పాటిస్తున్నారు. బిర్యానికి కావాల్సిన మసాలాను కూడా ప్రత్యేకంగా రెడీ చేస్తుండటం విశేషం. కట్టెల పొయ్యిపై చేసే ఈ బిర్యానీ రుచి అదిరిపోతుందని నిర్వహకులు అమీన్ షరీఫ్ వెల్లడించారు.

 

దాదాపు నాలుగు దశాబ్దాల పాటుగా ఈ ఫారం కోడి బిర్యానీ రెసిపీని అదే రుచితో ఫుడ్‌ లవర్స్‌కు అందిస్తూ వస్తున్నారు. ఈ పాక బిర్యానీని 1982లో ఐదు రూపాయలతో ప్రారంభించారు. నేటికీ అదే రుచితో ఈ బిర్యానీ ఫేమస్ అవుతూనే ఉంది. తారక్ ఈ బిర్యానీని ఇంతలా ఇష్టపడుతున్నారంటే దాని రుచే కారణం. ఓసారి మీరూ ట్రై చేయండి మరి.

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -