Devotional: కుటుంబ సమస్యలను దూరం చేసే చెట్టు గురించి మీకు తెలుసా?

Devotional: హిందూ సనాతన ధర్మంలో మొక్కలకు ప్రత్యేక స్థానం ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. హిందూ సంప్రదాయ ప్రకారం కొందరు మొక్కలను పూజిస్తూ ఉంటారు. వాటిలో తులసి, రావి, మామిడి, త్రిదళం, వేప, అరటి లాంటి మొక్కలను పూజిస్తూ ఉంటారు. వీటిని పూజించడం వల్ల వాస్తు ప్రకారం గా ఆర్థిక ప్రకారంగా ఏమైనా సమస్యలు ఉంటే తొలగి పోతాయని నమ్ముతూ ఉంటారు. నా హిందువులు పూజించే మొక్కలలో తెల్ల జిల్లేడు మొక్క కూడా ఒకటి.

సిటీలలో అంతగా కనిపించకపోవచ్చు కానీ పల్లెటూర్లలో మరీ ముఖ్యంగా పంట పొలాల్లో ఎక్కడ చూసినా కూడా తెల్ల జిల్లేడు మొక్కలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది దారికి అడ్డుగా ఉంది అంటూ ఈ తెల్ల జిల్లేడు మొక్కను తొలగిస్తూ ఉంటారు.. చాలామందికి తెల్ల జిల్లేడు మొక్క ప్రాముఖ్యత గురించి తెలియదు. తెల్ల జిల్లేడు చెట్టులో స్వయంగా విఘ్నేశ్వరుడు కొలువై ఉంటాడని ప్రతీతి. ఈ చెట్టు పువ్వులు శివుడికి చాలా ప్రీతికరమైనవి. మరి ఈ మొక్కను ఇంట్లో శుభ ముహూర్తంలో పెడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.

 

జిల్లేడు చెట్టు వేరుకాండం పిల్లలకు ఆనందాన్ని కలిగిస్తుంది. సంతాన సాఫల్యం కోసం స్త్రీ జిల్లేడు వేరు మొక్కను తమ నడుముకు కట్టుకోవాలి. తర్వాత పీరియడ్స్ వచ్చే వరకు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల సంతానం కలుగుతుంది. ఒక వ్యక్తికి అంతు చిక్కని వ్యాధి సోకితే జిల్లేడు చెట్టు ఆ వ్యాధిని తగ్గించేందుకు ఉపయోగ పడుతుంది. అందుకోసం పుష్య నక్షత్రం ఆదివారం ఆకు వేరును ఇంటికి తీసుకొచ్చి గంగాజలంతో కడగాలి. ఈ వేరుకు పచ్చిమిర్చి పూసి ధూపం వేయాలి. ఆ తర్వాత 108 గణపతి మంత్రాలను భక్తిశ్రద్ధలతో పఠించాలి.

 

ఆ తర్వాత ఆ వేరును రోగి తలమీద 7 సార్లు తిప్పి ఎవ్వరు తిరగని ప్రదేశంలో పాతిపెట్టాలి. ఇలా చేస్తే జబ్బు తగ్గుతుంది. తెల్ల జిల్లేడు చెట్టు కుటుంబలో అదృష్టాన్ని తీసుకు వస్తుంది. మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంటే తెల్ల జిల్లేడు చెట్టు వేరును కుడి చేతికి కట్టి గణపతి శక్తనాశన స్తోత్రం పాటించాలి.
తెల్ల జిల్లేడును ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నాటితే ఈ మొక్క మీ ఇంటిని చెడు ద్రుష్టి, చేతబడి, తంత్ర మంత్రాల ప్రభావాల నుండి కాపాడుతుంది.

Related Articles

ట్రేండింగ్

Kiran Kumar Vs Eswara Rao: పొలిటికల్ ట్విస్టులకు కేరాఫ్ ఆ నియోజకవర్గం.. ఆ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదో?

Kiran Kumar Vs Eswara Rao: శ్రీకాకుళం జిల్లాకు గేట్ వేగా చెప్పే ఎచ్చెర్ల నియోజకవర్గం పొలిటికల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. నిజానికి ఎచ్చెర్ల నియోజకవర్గం పొలిటికల్ కాంట్రవర్సీకి పెట్టింది...
- Advertisement -
- Advertisement -