Chiranjeevi: చిరంజీవి కెరీర్ లోని ఈ భారీ డిజాస్టర్ల గురించి మీకు తెలుసా?

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నటువంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ సాధించారు.ఇలా ఈయనని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి ఎంతోమంది అడుగుపెట్టి ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలలో కొనసాగుతున్నారు.

 

ఈ విధంగా సినిమాలలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన చిరంజీవి అనంతరం తన దృష్టిని రాజకీయాల వైపు మళ్ళించారు. ఇలా సొంతంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన ఈయన ఎన్నికలలో నిలబడి ఓటమిపాలయ్యారు. అనంతరం రాజకీయాలలో ఇమడలేక చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కొనసాగారు.ప్రస్తుతం చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ తిరిగి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

 

ఈ క్రమంలోనే చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా ప్రారంభించారు.ఇక ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ ఈ సినిమా తర్వాత వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాకి స్వయంగా తన కుమారుడు రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏకంగా 30 కోట్ల వరకు నష్టాలను తెచ్చిపెట్టింది.

ఇలా ఈ సినిమాలో వచ్చిన నష్టాలను ఆచార్య సినిమా ద్వారా పూడ్చాలని భావించిన రామ్ చరణ్ తిరిగి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో తన తండ్రితో కలిసి నటించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచి రామ్ చరణ్ కు భారీ నష్టాలను తీసుకువచ్చింది.అప్పటివరకు ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు సంపాదించుకున్న కొరటాల ఇమేజ్ కూడా డామేజ్ అయింది. ఇలా చిరంజీవి తన కెరీయర్ లో డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు చాలానే ఉన్నాయని చెప్పాలి మరి ఆ సినిమాలు ఏంటో లుక్ ఏసెద్దాం..

 

*అంజి
*శంకర్ దాదా జిందాబాద్
*మృగరాజ
*బిగ్ బాస్
*స్టువర్టుపురం పోలీస్ స్టేషన్
*ఎస్పీ పరశురామ్
*లంకేశ్వరుడు
*రాజా విక్రమార్క
*యుద్ధభూమి
*చక్రవర్తి
*ఆరాధన
*త్రినేత్రుడు
*కిరాతకుడు
*జేబుదొంగ
*రుద్రనేత్ర వంటి సినిమాలు కూడా ఈయన కెరియర్లో డిజాస్టర్ సినిమాలుగా నిలిచాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -