Milkman: కష్టపడితే ఏ పనికైనా తప్పకుండా ప్రతిఫలం అందుతుందనే విషయం మనకు తెలిసిందే. అయితే కొందరికి ఆ ప్రతిఫలం తొందరగా దక్కితే మరికొందరికి కాస్త ఆలస్యంగా దక్కుతుంది. అయితే ప్రతిఫలం ఆశించకుండా కష్టపడటమే మన వంతు.ఇలా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ పాలు అమ్మి చదువులు కొనసాగించినటువంటి ఓ వ్యక్తి ఇప్పుడు ఏకంగా ఎనిమిది వందల కోట్లకు అధిపతిగా మారడమే కాకుండా కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. మరి ఆ వ్యక్తి ఎవరు ఆయన సక్సెస్ స్టోరీ ఏంటి అనే విషయానికి వస్తే…
పశ్చిమ బెంగాల్ లోని నదియా జిల్లాలో ఒక పేద రైతు కుటుంబంలో నారాయణ్ మజుందార్ జన్మించాడు. పుట్టిన ఊరిలోనే చదువులు పూర్తి చేశారు పై చదువుల నిమిత్తం కాలేజీ చేరిక ఆయన ఫీజు 250 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది అప్పట్లో ఈ ఫీజ్ అంటే చాలా కష్టతరమే అందుకే నారాయణ్ ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు ఉదయం పొద్దున్నే సైకిల్ పై పాలు పోసేవారు. ఇలా పాలు పోస్తూ తన చదువును పూర్తి చేశారు. కోల్ కతాలోని క్వాలిటీ ఐస్ క్రీమ్ లో డైరీ కెమిస్ట్ గా నారాయణ్ ఉద్యోగం చేస్తూ.. నెలకు రూ.600 సంపాదించే వారు.
తరువాత సిలిగురి లో చేరాడు. అక్కడ మదర్ డెయిరీ మేనేజర్ డా.జగ్జీత్ పుంజార్థ్ అనే వ్యక్తితో పరిచయమైంది ఈ పరిచయం తన జీవితాన్ని మార్చింది అని చెప్పాలి. నారాయణ్ 1999లో రూ.10 లక్షల పెట్టుబడితో శీతలీకరణ ప్లాంటు ఏర్పాటు చేశాడు. తరువాత ఒక సంవత్సరం పాటు పాల ట్యాంకర్ కొనుగోలు చేసి తన భార్యతో కలిసి 2003 లో రెడ్ కౌ డైరీని స్థాపించాడు. 2007లో కోల్ కతా డెయిరీలో పార్ట్ నర్ షిప్ కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఆయన కంపెనీలో 1000 మంది పనిచేస్తున్నారు.
ఈయనకు బెంగాల్ లోని 12 జిల్లాల్లో 3 లక్షల మందికి పైగా రైతులతో వ్యాపార పరమైన సంబంధాలు ఉన్నాయి. నారాయణ్ మజుందార్ కంపెనీ ప్రతిరోజు 4 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. 35 పాల శీతలీకరణ ప్లాంట్లతో పాటు 400 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి.ఒకప్పుడు సైకిల్ పై పాలు అమ్ముతూ పార్ట్ టైం ఉద్యోగం చేసినటువంటి ఈయన వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తూ నేడు ఏకంగా ఎనిమిది వందల కోట్ల ఆస్తికి అధిపతి అవ్వడమే కాకుండా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.