Anchor Suma: రొమాంటిక్ సీన్లలో సుమ నటించిన సినిమా ఏదో తెలుసా?

Anchor Suma: బుల్లితెరపై స్టార్ యాంకర్ సుమ గురించి తెలియని వారంటూ ఉండరు. ముఫ్పై ఏళ్లకుపైగా ఇండస్ట్రీలో రాణిస్తూ.. యాంకరింగ్‌లో తనదైన ముద్ర వేసుకుంది. ఆమె ఏ షో చేసిన, ఏ ఈవెంట్ ఒప్పుకున్నా అది సూపర్ హిట్ అవ్వాల్సిందే. మాటల తూటాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటారు. సుమ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఓ సీరియల్‌లో నటించారు. ఆ తర్వాత ఆమె ఓ సినిమాలో హీరోయిన్‌గా కూడా చేశారు. ఆ తర్వాత బుల్లితెరపై తనదైన శైలిలో యాంకరింగ్‌ చేస్తూ యాంకర్ అనే పదానికి సరికొత్త అర్థాన్ని సృష్టించారు.

అయితే సుమ ‘కళ్యాణ ప్రాప్తిరస్తూ’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో వక్కంతం వంశీ హీరోగా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోకపోయినప్పటికీ ఆమె రొమాన్సుకి మాత్రం మంచి మార్కులు పడ్డాయానే చెప్పాలి. ఈ సినిమాను దర్శకుడు దాసరి నారాయణరావు చిత్రీకరించారు. ఈ చిత్రం అనుకున్నంతగా జనాలను ఆకట్టుకోలేకపోవడంతో తీవ్రంగా నిరాశకు గురైయ్యారు. ఈ సినిమాతో వంశీ ఇక నటించకూడదని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యినట్లు వెల్లడించారు.

ఆ తర్వాత సుమ మాత్రం మూడు, నాలుగు మలయాళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. ఇక ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచాయి. దీంతో హీరోయిన్‌గా మనకు సెట్ అవ్వదు అనుకొని బుల్లితెర వైపు అడుగులు వేసింది. ఆమె బుల్లితెరపై సీరియల్‌లో నటిస్తూనే రాజీవ్ కనకతో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె యాంకరింగ్ వైపు అడుగులు వేసి బుల్లితెరను ఓ రేంజ్‌లో రాణిస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సుమ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు లక్ష రూపాయలు దాకా పారితోషికం తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కానీ సుమ నటించిన సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటే ఆమె కూడా స్టార్ హీరోయిన్ అయ్యేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -