Lady Directors: టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటి ప్రేక్షకుల మెప్పు పొందిన డైరెక్టర్లు వీళ్లే!

Lady Directors: తెలుగు సినీ ప్రియులకు దర్శకుడు, దర్శకురాలు అనే హోదా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సాధారణంగా డైరెక్టర్లు అన్నాక ఇండస్ట్రీలో ఎక్కువగా మేల్ డైరెక్టర్లు కనిపిస్తూ ఉంటారు. వీళ్లు టాలీవుడ్ కి మంచి కథలను పరిచయం చేసి డైరెక్టర్లుగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో లేడీ డైరెక్టర్లు కూడా తమ సత్తాను చాటుకుంటున్నారు.

ఈ క్రమంలో అప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు లేడీ డైరెక్టర్లు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి, దర్శకురాలుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు మనం వారి వివరాలు తెలుసుకుందాం. తమిళ నటుడు సూర్య చేత ఆకాశమే నీకు హద్దురా సినిమాను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఒక మహిళా దర్శకురాలే. ఆ దర్శకురాలి పేరు సుధ కొంగర ఇక ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా సుధ కొంగర సూర్యతో మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక అప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్ ల విషయానికొస్తే విజయనిర్మల గారి గురించి ముందుగా మాట్లాడుకోవాల్సిందే. మొత్తం 44 సినిమాలకు ఆమె దర్శకత్వం వహించారు. ప్రపంచంలో ఏ భాషలో కూడా ఇన్ని సినిమాలను ఏ డైరెక్టర్ తీయలేదు. అందుకని ప్రపంచంలో ఎక్కువ సినిమాలుకు దర్శకత్వం వహించిన దర్శకురాలిగా గిన్నిస్ రికార్డును తన సొంతం చేసుకున్నారు. అదేవిధంగా భానుమతి నటిగా, నిర్మాత, దర్శకురాలు, గాయనిగా కూడా ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వెలుగు వెలిగింది.

సొంత నిర్మాణ సంస్థలో చండీ రాణి సినిమాను భానుమతి తీశారు. ఈ సినిమాలో తానే హీరోయిన్ గా నటించారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఆరు పాటలు కూడా భానుమతినే పాడింది. ఇక అప్పట్లో మహానటి సావిత్రి కూడా దర్శకత్వం పైనే దృష్టి పెట్టి, పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. నటనతోనే కాకుండా విభిన్న దర్శకురాలిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సావిత్రి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -