Prabhas: ప్రముఖ నటుడు కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్ ఈశ్వర్ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపు పొందిన ప్రభాస్ ఆ తర్వాత వచ్చిన చక్రం, వర్షం, చత్రపతి, బిల్లా వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో నటించిన ప్రభాస్ ఆ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు.
పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ కి బాలీవుడ్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉండగా ప్రభాస్ రిజెక్ట్ చేసిన కొన్ని సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యయి. ఇలా ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాతో అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదిగాడు. అసలు విషయం ఏమిటంటే.. ఆర్య సినిమా స్టోరీతో దిల్ రాజు ప్రభాస్ వద్దకు రాగా ప్రభాస్ ఈ సినిమాని రిజెక్ట్ చేసాడు.
ప్రభాస్ కి కథ వినిపించగా..అలాంటి లవ్ స్టోరీ తనకు సూట్ అవుతుందో లేదో పైగా కొత్త దర్శకుడు సుకుమార్ అనే ఆలోచనతో ఆ సినిమాని రిజెక్ట్ చేశాడు. దీంతో దిల్ రాజు బన్నీని కలసి స్టొరీ చెప్పగానే బన్నీ ఓకే చేశాడు. గంగోత్రి సినిమాలో తన లుక్ గురించి విమర్శలు చేసిన వారికి ఆర్య సినిమాతో సమాధానం చెప్పాలని అల్లు అర్జున్ ఈ సినిమాని అంగీకరించాడు. బన్నీ అనుకున్నట్లుగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఆ తర్వాత భద్ర సినిమా ఆఫర్ ని కూడా దిల్ రాజు మొదటగా ప్రభాస్ కి ఇచ్చినట్లు సమాచారం. అయితే అందులో యాక్షన్ ఉండటంతో యాక్షన్ సినిమా మనకి అవసరమా అంటూ ప్రభాస్ దీన్ని కూడా రిజెక్ట్ చేశాడు. దీంతో ఈ ఆఫర్ రవితేజకి వెళ్లి ఆయన కెరీర్ లో మంచి హిట్ సినిమాగా నిలిచిపోయింది. ఇలా ప్రభాస్ రిజెక్ట్ చేసిన ఈ రెండు సినిమాలకు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.