Chiranjeevi: చిరంజీవి, రాజమౌళి తల్లికి దగ్గర సంబంధం ఉందని సంగతి మీకు తెలుసా?

Chiranjeevi: టాలీవుడ్ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ఇండస్ట్రీలో అతని స్థాయిని గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు 150 సినిమాలకు పైగా నటించి నటనలో తనకంటూ చరగని ముద్ర సంపాదించుకున్నాడు. ఇక టాలీవుడ్ లో చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. చిరంజీవి ప్రస్తుతం కుర్ర హీరోలతో సమానంగా సినీ అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్లో అగ్రస్టార్ హీరోగా వెలుగుతున్నాడు.

ఇదంతా పక్కన పెడితే.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గురించి మనందరికీ తెలిసిందే. విజేందర్ ప్రసాద్ ఒక మంచి రైటర్. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ల నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. రాజమౌళి తండ్రి కూడా తనలానే ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆయన కమ్మ వర్గానికి చెందినవాడు. అతని భార్య రాజనందిని కాపు వర్గానికి చెందినది. ఇక ఖైదీ సినిమా సూపర్ హిట్ అయిన సమయంలో రాజ నందిని మా చిరంజీవి అదరగొట్టేసాడు అని అనేదట.

దాంతో విజయేంద్రప్రసాద్ ఊరికే మా చిరంజీవి అంటున్నావ్ తనేమైనా మీ బంధువు అని అడిగాడట. దాంతో రాజనందిని తను మా బంధువు కాదు. తను మా కాపు కులానికి చెందినవాడు అని చెప్పిందట. అంతేకాకుండా మా ఆవిడ చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అని, మా ఇంట్లో మేమందరం కులాంతర వివాహాలు చేసుకున్నామని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించాడు. ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోలతో సమానంగా సినిమా ఆఫర్లు సొంతం చేసుకుంటున్నాడు.

ఇక చిరంజీవి రాబోయే సినిమాల విషయానికొస్తే గాడ్ ఫాదర్. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదేవిధంగా బోలాశంకర్ సినిమా కు మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలతో చిరు ప్రేక్షకులను ఏవిధంగా మెప్పిస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -