Arun Kumar-Krishna Priya: ప్రేమకు మనసు ఉంటే చాలు అని నిరూపించిన డైరెక్టర్ అరుణ్ కుమార్, కృష్ణప్రియ!

Arun Kumar-Krishna Priya: అరుణ్ కుమార్, సీరియల్ నటి కృష్ణప్రియ ఫోటోలు 2013లో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. చాలామంది ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేశారు. ఈ నల్లగా ఉండే అబ్బాయికి అంత అందమైన కృష్ణప్రియ ఎలా లవ్ చేసింది అందుకే అంటారేమో ప్రేమ గుడ్డిది అని చాలామంది కామెంట్ చేశారు.

మరికొందరైతే అరుణ్ అదృష్టవంతుడు ఇంత అందమైన అమ్మాయిని ప్రేమలో పడేశాడంటూ కామెంట్ చేశారు. అప్పట్లో తమిళ సినీ ఇండస్ట్రీలో ఇది ఒక హాట్ టాపిక్ గా నిలిచింది. చాలామంది అసూయతో నెగటివ్ గా మాట్లాడారు. కానీ వీరిపై వచ్చిన ట్రోల్స్ పై ఇద్దరు కూడా ఎప్పటికీ స్పందించలేదు. బయట ఎక్కడ దీని గురించి వీరు ఎప్పుడు చర్చించలేదు.

ఇక అరుణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేశాడు. తర్వాత స్నేహితుడా సినిమాకి కూడా అసిస్టెంట్ గా చేసి ఇక సొంతంగా దర్శకత్వం చేయాలనుకుని ఒక కథ రాసుకుని అందరి హీరోల చుట్టూ తిరిగేవాడు. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఇక ఈ అరుణ్ కుమార్ కు ఒక గ్యాంగ్ ఉంది. అందులో హీరో శివ కార్తికేయన్ కూడా ఉన్నాడు. ఇంకా కొందరు సినిమాల కోసం ప్రయత్నించేవారు ఉన్నారు.

ఇక ఒక పార్టీలో కృష్ణప్రియ తో పరిచయం ఏర్పడింది. కృష్ణప్రియను ప్రేమించడం మొదలుపెట్టి ప్రతి చిన్నదానికి పార్టీలు ఏర్పాటు చేసి అందర్నీ కలుసుకుని ఇలా చేసేవాడు అరుణ్ కుమార్. ఒక పార్టీలో కృష్ణప్రియ తన పెళ్లి కోసం జాతకాలు చూస్తున్నారంటే అరుణ్ కుమార్ సరదాగా తనవి కూడా చూపించమన్నాడు. తర్వాత కృష్ణప్రియ వెళ్లిపోవడంతో.. ఫోన్ చేసి ఎందుకు అలా అన్నావని అతనిపై కోప్పడింది.

తర్వాత కొన్ని రోజులకు పదేపదే ఫోన్లు చేయడంతో ఐ లవ్ యూ అని కూడా చెప్పేసింది. ఇక వీరి బంధానికి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. ఆ తర్వాత ఇక ఒక కథ రాసుకుని ఆర్యకు వినిపిస్తే అతను ఓకే చెప్పడంతో రాజా రాణి సినిమాకు దర్శకత్వం వహించాడు. అలా ఇతను విజయ్ దళపతికి మూడు హిట్స్ ఇవ్వడం జరిగింది. ఇక బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తో కూడా జవా సినిమాకు దర్శకత్వం వహించడం జరిగింది. ఇక కృష్ణప్రియ సరైన అవకాశాలు రావడంలేదని అరుణ్ కు సపోర్టుగా ఉండి డైరెక్షన్ కు కావాల్సినవన్నీ దగ్గరుండి అన్ని చూసుకుంటుంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -