Amla Benefits: ఉసిరి తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? ఆరోగ్యానికి ఉసిరి ఎన్ని రకాలుగా మేలు చేస్తుందో తెలుసా?

Amla Benefits: ఉసిరికి ప్రపంచవ్యాప్తంగా “సూపర్ ఫ్రూట్‌గా మంచి పేరు సంపాదించుకుంది. 100 గ్రాముల ఉసిరి 20 నారింజలతో సమానమైన విటమిన్ సి ని అందిస్తుంది. ఉసిరి చ‌లికాలంలో ఎక్కువ‌గా ల‌భిస్తుంది. రోజూ దీనిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

 

ఆరోగ్య ప్రయోజనాలు
ఉసిరిలో ఎక్కువ‌గా విట‌మిన్ సి ఉండ‌డం వ‌ల‌న ఇది రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందిస్తుంది. అలాగే వీటిలో ఉండే పైటో నూట్రియెంట్లు, యాంటీఆక్సిడెంట్లు జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతాయి. ఆమ్లా డిమెన్షియా రోగుల‌కు ఉసిరి మంచి ఔష‌ధం. ఆమ్లాలో ఫైబ‌ర్ శాతం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల‌న ఇది మ‌ధుమేహ బాధితుల‌కు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. చ‌క్కెర‌లో శోష‌న రేటును త‌గ్గించేందుకు ఉసిరికి మించిన ఉప‌శ‌మ‌నం లేదు. అంతేకాకుండా ర‌క్తంలో చ‌క్కెర పెరుగుద‌ల‌ను కూడా ఉసిరి త‌గ్గిస్తుంది.

 

బ‌రువు త‌గ్గేందుకు ఉసిరి బాగా ప‌నిచేస్తుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి మీ శ‌రీర బ‌రువును అదుపులో ఉంచుతుంది. ఉసిరి జ్యూస్‌ రోజూ తాగడం వల్ల చర్మంపై నల్లటి మచ్చలను తొల‌గించుకోవ‌చ్చు. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందడం కోసం ఉసిరి రసం తాగడం మంచిది.

 

ఉప్పుతో నేరుగా ఉసిరిని తీసుకోవ‌చ్చు. అంతేకాకుండా చ్యవన్‌ప్రాష్ త‌యారీలో కూడా దీనిని ఉప‌యోగిస్తారు. ఇంట్లో చేసుకునే మొర‌బ్బా లేదా ఉసిరి జామ్‌లు సంవ‌త్స‌రాల పాటు నిల్వ ఉంటాయి. వీటిని భోజ‌నంతోపాటు ఆర‌గించ‌వ‌చ్చు. రోజూ 1 టీస్పూన్ ఉసిరి పొడిని 1 టీస్సూన్ తేనె లేదా గోరువెచ్చ‌ని నీటితో క‌లిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరి మంచి మౌత్ ఫ్రెష‌న‌ర్‌గా కూడా ప‌నిచేస్తుంది. ఇది డైజెస్టివ్ ఎయిడ్‌, యాంటాసిడ్‌గా లా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -