Tollywood: టాలీవుడ్ స్టార్స్ లో ఎవరు ఎంత తీసుకుంటున్నారో మీకు తెలుసా?

Tollywood: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు కేవలం తెలుగు భాషకు మాత్రమే పరిమితం అయ్యేవి అయితే ఇప్పుడు తెలుగు సినిమాలకు సరిహద్దులు చెరిగిపోయాయి. తెలుగు సినిమాలు ఏకంగా జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడంతో హీరోలకు కూడా పెద్ద ఎత్తున మార్కెట్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే హీరోల రెమ్యూనరేషన్లు ఏకంగా ఆకాశాన్ని తాకుతున్నాయి.మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే విషయానికి వస్తే..

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయిన ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు వందకోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకు దాదాపు 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి ఈయన ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఏకంగా ఈ సినిమా సీక్వెల్ కు 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు సమాచారం.

 

ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన RRRసినిమాకు ఒక్కొక్కరు 45 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు దాదాపు మూడు సంవత్సరాల క్రితం వీరు కమిట్ అయ్యారు. కనుక ప్రస్తుతం వీరి మార్కెట్ విలువ ఇంకా ఎంత అనేది క్లారిటీగా తెలియడం లేదు. వీరు నటించిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో గ్లోబల్ స్టార్స్ గా గుర్తింపు పొందిన ఈ హీరోలు తమ తదుపరి సినిమాలకు దాదాపు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని సమాచారం.

 

ఇక చిరంజీవి సైతం ఒక్క సినిమాకు 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. నాని రవితేజ వంటి హీరోలు ఒక్కో సినిమాకు 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక బాలకృష్ణ మాత్రం ఇప్పటివరకు 15 కోట్లకు మించి రెమ్యూనరేషన్ అందుకోలేదని తెలుస్తుంది. వెంకటేష్ సైతం ఒక్కో సినిమాకు పది నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.పవన్ కళ్యాణ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే విషయాన్ని ఆయన స్వయంగా తెలియజేశారు ఆయన ఒక్కో రోజుకు ఏకంగా రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని స్వయంగా వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -