NagaShourya: నాగశౌర్య అనూషల మధ్య అనుబంధం అలా మొదలైందా?

NagaShourya: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవల కుర్ర హీరోలందరూ వరసపెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో రానా దగ్గుబాటి, నిఖిల్ ఓ ఇంటి వారయ్యారు. ఆ తర్వాత నితిల్ కూడా తన సింగిల్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టి.. ఓ ఇంటివాడయ్యాడు. తాజాగా యంగ్ హీరో నాగశౌర్య కూడా ఓ ఇంటి వాడయ్యాడు. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో ఏడడుగులు వేశాడు. ఆదివారం బెంగళూరులో నాగశౌర్య-అనూష శెట్టి దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు. బంధుమిత్రులు, కుటుంబసభ్యుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలకు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు.

కాగా, విజయవాడకు చెందిన నాగశౌర్య 2011 ‘క్రికెట్ గార్ల్స్ అండ్ బీర్’ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి, జాదుగాడు, అబ్బాయిలతో అమ్మాయి’ వంటి సినిమా చేశాడు. అయితే ఈ సినిమాలు ఊహించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. ‘కళ్యాణ వైభోగమే, ఛలో’ సినిమాతో నాగశౌర్యకు మంచి బ్రేక్ వచ్చింది. ఆ తర్వా నటించిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయినా.. ‘ఓ బేబీ, వరడు కావలెను, కృష్ణ వ్రింద విహారి’ సినిమాలు కమర్షియల్ హిట్ అయ్యాయి.

 

అయితే ఇండస్ట్రీలో చాలా సైలెంట్‌గా ఉండే నాగశౌర్యపై ఎలాంటి రూమర్స్ రాలేదు. ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్లతో కలిసి సినిమాలు చేసినా.. తన లిమిట్స్ లో తాను ఉండేవాడు. అలాంటి నాగశౌర్య.. అనూష శెట్టితో ఎలా ప్రేమలో పడ్డాడనే సందేహం అందరిలో తలెత్తే ఉండి ఉంటుంది. అయితే అనూష శెట్టి ఓ ఫేమస్ ఇంటీరియల్ డిజైనర్. అయితే ఆమె డిజైన్లు నచ్చడంతో నాగశౌర్య కొన్ని కాంట్రాక్టులు కూడా ఇప్పించాడు. అలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి తమ తల్లిదండ్రులను ఒప్పించారు. అలా వివాహ బంధంతో నాగశౌర్య-అనూష ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts