Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యం ఎలా ఉందో మీకు తెలుసా?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్‌ అనే వ్యాధి భారీ నుంచి కోలుకుంటోంది. ఆ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ ఒకవైపు తీసుకుంటూనే మరోవైపు సినిమాలు, ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. ఇకపోతే సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం. ఈ సినిమా వచ్చే నెల అనగా ఏప్రిల్ 14వ తేదీన పేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రం బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

 

ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ప్రస్తుతం వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతోంది సమంత. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ఆరోగ్యం విషయం గురించి తెలిపింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. మయోసైటిస్‌ వ్యాధి నిర్ధారణ అయిన మొదట్లో చాలా బలహీనంగా అనిపించేది. యశోద సినిమా సమయంలో ఆరోగ్యం మరింత క్షీణించింది. అయినప్పటికీ యశోద సినిమా ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నాను. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఓపిక అస్సలు ఉండేది కాదు. ఆ సమయంలో కోల్పోవడం కోసం ఎన్నో మందులు తీసుకున్నాను.

కానీ సినిమా నా భుజాలపై ఉండడంతో బాధ్యతగా భావించి కష్టంగా ఉన్నప్పటికీ ఒక్క ఇంటర్వ్యూ అయినా చేయాలి అనుకున్నాను. కానీ ఈ సాధ్యం కాలేక పోయింది. తర్వాత నెమ్మదిగా ఆరోగ్యం కుదుటపడుతూ వచ్చింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో కోలుకున్నాను. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంటూ ధైర్యంగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది సమంత. కాగా సమంత నటించిన ఈ శాకుంతలం పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే.

 

కాగా ఇందులో దేవ్‌ మోహన్‌, సచిన్‌ ఖేడ్కర్‌, మోహన్‌బాబు, అదితి బాలన్‌, అనన్య కీలక పాత్రల్లో నటించారు. కాగా సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు బాలీవుడ్లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ఖుషి సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా సమంత ఆరోగ్యం బాగో లేకపోవడంతో ఆ సినిమా వాయిదా పడిన సంగతి మనందరికీ తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -