Whatsapp: వాట్సాప్ లో పోల్ ఫీచర్ ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసా?

Whatsapp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువస్తోంది వాట్సాప్ సంస్థ. కాగా ఇప్పటికే కొన్ని రకాల ఫీచర్స్ ని తీసుకొచ్చిన వాట్సాప్ సంస్థ తాజాగా మరో సరికొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది. ఇటీవల వాట్సాప్ తీసుకొచ్చిన ఫీచర్లలో వాట్సాప్‌ పోల్‌ ఫీచర్ కూడా ఒకటి. ఇప్పటికే చాలా మంది యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇంతకీ ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలి? దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

వాట్సాప్‌ గ్రూప్స్‌లో సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ తో పనిచేసే ఈ ఫోన్‌లలో ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది.

మొదట వాట్సాప్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి మీరు పోల్‌ క్రియేట్ చేయాలనుకుంటున్న పర్సనల్ చాట్‌ లేదా గ్రూప్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం చాట్‌ బాక్స్‌ పక్కన ఉండే అటాచ్‌మెంట్ సింబల్‌ను క్లిక్‌ చేయాలి. వెంటనే డాక్యుమెంట్, కెమెరా, గ్యాలరీతో పాటు చివరల్లో కొత్తగా యాడ్‌ చేసిన పోల్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయగానే ఆస్క్‌ క్వశ్చన్‌ తో పాటు కింద ఆప్షన్స్‌ కనిపిస్తాయి.

 

ఆస్క్‌ క్వశ్చన్‌ లో మీరు అడగాల్సిన ప్రశ్నను ఎంటర్‌ చేసి కింద దానికి ఆప్షన్స్‌ ఇవ్వాలి. తర్వాత సెండ్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే వెంటనే మీరు కోరుకున్న వ్యక్తికి ఆ పోల్‌ వెళుతుంది. పోల్‌ను రిసీవ్‌ చేసుకున్న వారికి ప్రశ్నతో పాటు ఆప్షన్స్‌ కనిపిస్తాయి. ఓట్లు వేసిన తర్వాత కింద వ్యూ ఓట్స్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. ఏ ఆప్షన్‌కు ఎన్ని ఓట్లు పడ్డాయన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -