Ramya Krishna: రమ్యకృష్ణ కడుపుతో ఉన్నప్పుడు ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

తెలుగు ప్రేక్షకులకు అప్పటి అందాల తార రమ్యకృష్ణ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి తెలుగునాట నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక రమ్యకృష్ణ అందానికి అప్పట్లో ఎంతోమంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాదాపు 300 సినిమాలకు పైగా నటించి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకుంది.

ప్రస్తుతం ఆమె ఈ జనరేషన్ ప్రేక్షకులను కూడా నటిగా ఆకట్టుకుంటుంది. స్టార్ హీరో, హీరోయిన్ లకు తల్లి పాత్రలు చేస్తూ ఇప్పటి ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఒకప్పుడు సినిమా ఆఫర్ విషయం లో ఏమాత్రం డోకా లేని ఆమెకు ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమా ఆఫర్లు అందుకుంటుంది. ఇదిలా ఉంటే ఆహా ఓటీటీ లో ప్రసారమవుతున్న డాన్స్ ఐకాన్ షోకు అదిరిపోయే స్పందన వస్తుంది.

ఇందులో రమ్యకృష్ణ జడ్జిగా చేస్తూ ఓటీటీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. అలాగే ఆమె గతంలో ఎప్పుడూ చూడని విధంగా డాన్స్ చేస్తూ.. అద్భుతమైన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక సయ్యా సయ్యారే అంటూ ఆమె చేసిన స్పెషల్ సాంగ్ వెనుక ఉన్న ఒక అద్భుతమైన సీక్రెట్ ను బయటపెట్టింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నా అల్లుడు సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్ల మదర్ పాత్ర చేసింది.

ఇందులో సయ్యా సయ్యారే అనే పాటకు ఆమె డాన్స్ చేసారు. ప్రస్తుతం ఇదే పాటకు డాన్స్ ఐకాన్ షో లో ఒక కంటెస్టెంట్ డాన్స్ చేసింది. దీనితో రమ్య కృష్ణ ఆ సాంగ్ చేసేటప్పుడు నేను నాలుగు నెలల ప్రెగ్నెంట్ ను, అందుకే ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్ అని చెప్పారు. దీంతో ఆ షో లో ఉన్న వారంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం రమ్యకృష్ణ డాన్స్ ఐకాన్ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ.. ఇప్పటి తరం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -