Gopal Reddy: ఆ సినిమా షూటింగ్ సమయంలో దానిని చూసి షాక్ అయ్యా: ఎస్ గోపాల్ రెడ్డి

Gopal Reddy: ఎస్ గోపాల్ రెడ్డి ఒక భారతీయ సినిమాటోగ్రాఫర్, స్క్రీన్ రైటర్, దర్శకుడు ఇంకా నిర్మాత. తెలుగు సినిమా ఇంకా బాలీవుడ్ లో తన రచనలకు ప్రసిద్ధి చెందాడు. ఈయన 1971లో మోసగాళ్లకు మోసగాడు సినిమాకు ఆపరేటివ్ కెమెరామెన్ గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు.

ఆ తర్వాత 35 సినిమాలకు పైగా సినిమాటోగ్రాఫర్ గా పనిచేయడం జరిగింది. ఇక రచయితగా, నిర్మాతగా 1991 లో వచ్చిన క్షణక్షణం సినిమా నుంచి ఎన్నో సినిమాలను నిర్మించడం జరిగింది. క్షణక్షణం సినిమాకు ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా నంది అవార్డు సొంతం చేసుకున్నాడు.

ఈయన నిర్మించిన చిత్రాలలో కూలి నెంబర్ వన్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, హలో బ్రదర్, సిసింద్రీ, సూర్యవంశం సంతోషం, వర్షం నా ఆటోగ్రాఫ్, శ్రీరామదాసు, రాఖి, దృశ్యం లు ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. ఇలా కెరీర్ లో ముందుకు సాగుతున్న గోపాల్ రెడ్డి గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.

ఇక ఆ ఇంటర్వ్యూ ద్వారా తాను ఎక్కువగా సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా సినిమాలు నిర్మించడం జరిగిందని, అందుకే ఈయనకు నాగార్జున, విక్టరీ వెంకటేష్ గారు చాలా క్లోజ్ గా ఉంటారని తెలపడం జరిగింది. ఇక అగ్గి రాముడు చిత్రం షూటింగ్లో జరిగిన ఒక సంఘటన తాను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని తెలపడం జరిగింది.

ఆ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో వెంకటేష్ గారు కాటికాపరిలాగా నిలబడి ఉన్న సమయంలో కింద కూర్చొని షార్ట్ ఓకే చేయాలి. ఆ సమయంలో తాను కూర్చున్న క్లాత్ ను ఎవరో పక్కనుంచి లాగుతున్నట్లు అనిపించింది. అప్పుడు ఎవరో అనుకొని ఉండవయ్యా అంటూ అనడం జరిగింది.

రెండు మూడుసార్లు ఇదే రిపీట్ కావడంతో ఏమిటా అని చూస్తే ముందు నుంచి ఒక పెద్ద పాము వెళ్తుండడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యానని తెలపడం జరిగింది. ఇక అక్కినేని నాగార్జున వ్యక్తిత్వం తనకు బాగా నచ్చేదట.

అందుకే ఆయన ఎప్పుడూ నాగార్జునతో క్లోజ్ గా ఉండడం జరుగుతుందని తెలిపాడు. ఇక డైరెక్టర్ల విషయానికి వస్తే కే రాఘవేంద్రరావు ఈయనకు ఇష్టమైన దర్శకుడిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఒక సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -