Lord Shiva: శివుడిని పూజించే టైమ్ లో ఈ తప్పులు చెయ్యకూడదని మీకు తెలుసా?

Lord Shiva: సాధారణంగా హిందువులు పెద్ద ఎత్తున పూజలు చేస్తూ దేవదేవతలను నమస్కరిస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా అభిషేక ప్రియుడు అయినటువంటి శివుడిని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రతి సోమవారం శివుడికి ప్రత్యేకమైన పూజలు చేయడమే కాకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు.అభిషేక ప్రియుడికి వివిధ రకాల పదార్థాలతో అభిషేకం చేయడం వల్ల ప్రీతి చెంది మనం కోరిన కోరికలను నెరవేర్చుతారు.

ఇలా ఆ శివయ్యకు పూజించే సమయంలో కొన్ని విషయాలను గుర్తు పెట్టుకొని పూజ చేయాల్సి ఉంటుంది పొరపాటున కూడా పూజలో మనం చేయకూడని తప్పులు చేస్తే శివుడి ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది. మరి శివయ్యకు పూజ చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదనే విషయానికి వస్తే…శివుడికి విభూది అంటే ఇష్టం కనుక విభూతితో అభిషేకం చేయడం వల్ల శివుడు ప్రసన్నమవుతూ మన కోరికలను నెరవేరుస్తారు.

 

పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన బిల్వదలాలను అలాగే వెలగపండును సమర్పించి పూజ చేయడం వల్ల దీర్ఘాయుష్ తో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయి. అయితే పొరపాటున కూడా శివుడి పూజలు తులసి ఆకులను ఉపయోగించకూడదు. అలాగే శివుడికి పసుపు కుంకుమలతో పూజ చేయకూడదు. సాధారణంగా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని ఎవరు పూజ చేయకూడదు ఒకవేళ పూజిస్తే జల ధార ఉండేలా పూజ చేయాలి.

 

శివలింగంపై తప్పనిసరిగా నీరు పడుతూ ఉండేలా ఏర్పాటు చేసుకున్న వారు మాత్రమే శివలింగాన్ని పెట్టి పూజించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే శివగ్రహానికి గురికావాల్సి ఉంటుంది.ఇలా జల ధార లేకుండా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో పెద్ద ఎత్తున నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి ఎన్నో సమస్యలు చికాకులు గొడవలు తలెత్తుతూ ఉంటాయి. అందుకే శివలింగం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా శివుడికి పూజించే సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -