Green Peas: ఆ బఠాణీలు తింటే ఆరోగ్యానికి మంచిదట!

Green Peas: అనేగానే చాలా మంది కడుపులో గ్యాస్‌ సమస్య తెప్పిస్తుందని భావించి వాటికి దూరంగా ఉంటారు. మనం తీసుకునే ఆహారంలో సరిపడే ఫైబర్‌ ఉంటే ఎలాంటి గ్యాస్‌ సమస్య రాదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. అయితే బఠాణీలను కూరల్లో వాడటంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయని ఆరోగ్య నిపుణులు సలహాలు చేస్తున్నారు. గ్రీన్‌ బఠాణీలు నోటికి రుచినివ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చక్కటి ఫలితాలు ఇస్తాయి. ఒమేగా 3 ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్న బఠాణీలను తీసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.
అల్జీమర్స్, ఆర్థరైటీస్‌ వంటి జబ్బులు రాకుండా బఠాణీల్లోని పోషకాలు అడ్డుకుంటాయి. ఎముకల్ని కాపాడతాయి.

కొవ్వు శాతం తక్కువగా ఉన్న బఠాణీల్లో ప్రోటీన్, ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని అధికంగా తీసుకోవాలి. బఠాణీల్లోని అధికమొత్తంలో ఉన్న ఫైటో న్యూట్రియెంట్స్‌ పొట్ట క్యాన్సర్‌ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి. ఫ్లేవనాయిడ్స్, యాంటీయాక్సిడెంట్స్‌ కలిగిన బఠాణీలను తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా తయారవుతుంది.

 

ఫైబర్‌ అధికంగా ఉన్న బఠాణీలు తీసుకోవడం వల్ల రక్తసరఫరా సరిగ్గా జరుగుతుంది. దీని వల్ల టైప్‌ 2 డయాబెటిస్‌ రాకుండా ఉంటుంది.బీ1, బీ2, బీ3, బీ6 విటమిన్స్‌ కలిగిన బఠాణీలు తీసుకోవడం వల్ల గుండె సమస్యల ముప్పు నుంచీ తప్పించుకోవచ్చు. ఒక కప్పు బఠాణీలు 44శాతం విటమిన్‌ (కే)ని కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. మార్కెట్‌లో ఏడాది మొత్తం దొరికే బఠాణీలను ఇష్టంగా తిని లాభాలు పొందవచ్చు. బహిరంగ మార్కెట్‌లో కేజీ గ్రీన్‌ బఠాణీలు రూ.40–50కి దొరుకుతున్నాయి.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts