TTD: తిరుమల భక్తుల కొరకు టీటీడీ తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా?

TTD: కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు తిరుమల తిరుపతి చేరుకుంటారు. ఇల వైకుంఠంగా భావించే తిరుమల తిరుపతి దర్శనం ఎంతో అద్భుతంగా ఉంటుంది. శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు హాజరు కావడంతో భక్తుల కోసం టీటీడీ బోర్డు అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. భక్తులకు ఉచిత దర్శన భాగ్యం కల్పించటమే కాకుండా, ఉచిత భోజన సదుపాయం అలాగే వసతి గృహాలను ఏర్పాటు చేస్తోంది.

సామాన్యుల నుంచి వీవీఐపీ వరకు తిరుమలలో వివిధ రకాల గదులు అందుబాటులో ఉంచింది. అయితే రోజు రోజుకి శ్రీవారి దర్శనం కోసం భక్తుల తాకిడి పెరగటంతో నూతన వసతి గృహాలు ఏర్పాటు చేయటానికి టీటీడీ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అతిథి గృహాల నిర్మాణం కోసం తాజాగా టెండర్లు నిర్వహించగా ఊహించని రీతిలో విరాళం కోట్ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చెన్నైకి చెందిన జీస్క్వేర్ రియల్టర్ సంస్థ రూ.25,77,77,777 విరాళంగా కోట్ చేసింది.

 

ఈ అతిథి గృహాన్ని దాత సొంతంగా నిర్మించి టీటీడీ బోర్డుకు అప్పగించనున్నారు. అలాగే గదుల నిమాయకంలో పారదర్శకత పెంచేందుకు మార్చి 1 నుంచి ఫేస్ రీడింగ్ గుర్తింపు విధానాన్ని కూడా అమలు చేశారు. భక్తుల ఆధారిత సేవలతో గదులను కేటాయిస్తున్నారు. ఇదిలా ఉండగా తిరుమలలో పర్యావరణ సంరక్షణ కోసం టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ సంరక్షణ కోసం టిటిడి ప్లాస్టిక్ నిషేధించింది తాగునీటి కోసం ప్లాస్టిక్ బాటిళ్లు నిషేధించి భక్తులకు రాగి, స్టీల్ , గాజు బాటిళ్లను అందుబాటులో ఉంచింది.

 

రాగి బాటిల్ ధర రూ.450, స్టీల్ బాటిల్ ధర రూ.200 గా టిటిడి నిర్ణయించింది. అయితే ముందుగా వీటిని పద్మావతి విచారణ కార్యాలయంలో ఉంచారు. ఇలా ఎప్పటికప్పుడు భక్తుల సౌకర్యార్థం టీటీడీ అనేక చర్యలు తీసుకుంటుంది. ఇటీవల భక్తుల సౌకర్యం కోసం రూ. 120 కోట్ల రూపాయలు హెచ్చించి అతిథి గృహాలను పునరుద్ధరించారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడం కోసం టీటీడీ అధికారులు ఈ విధమైనటువంటి సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -