Tarak: యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఉన్న గొప్ప లక్షణాలు తెలుసా?

Tarak: నందమూరి వంశంలో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేక పేజీ ఉంది. తాతకు తగ్గ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన అంతర్జాతీయంగా కూడా ఫేమస్ అయ్యారు. తాజాగా ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. వాటిని సినిమా మేకర్స్ తెరదించారు. 2024వ సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన తారక్, కొరటాల కాంబోలోని సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందని అధికారిక ప్రకటన వెలువడింది.

 

సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని పోస్టర్ ద్వారా ప్రేక్షకులకు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు. ఇందులో తారక్ తో జోడి కట్టేది ఎవరో మాత్రం ఇంకా వెల్లడించలేదు. వచ్చే నెల ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ ఏడాదిలోనే తారక్, కొరటాల సినిమా విడుదలవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అది జరగదని తెలిసి అభిమానులు నిరాశ చెందారు.

 

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్నటువంటి 5 గొప్ప లక్షణాల గురించి సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. టాలీవుడ్ లో తారక్ స్టార్ హీరో అయినా పెద్దలను గౌరవించే విషయంలో మాత్రం ముందుంటాడు. తన సినిమా వల్ల నిర్మాతలకు నష్టాలు వస్తే కచ్చితంగా వారిని ఆదుకుంటాడు. అయితే నిర్మాతలకు తాను డబ్బును వెనక్కి ఇచ్చే విషయం గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించరు. కొత్త టాలెంట్ ను తారక్ ఎంతగానో ప్రోత్సహిస్తుంటాడు. అందుకే ఇండస్ట్రీకి డైరెక్టర్లుగా రాజమౌళిని, వివి వినాయక్ ను పరిచయం చేశారు.

 

సినిమా కెరీర్ విషయంలో అయితే చాలా మంది ఫ్లాప్ డైరెక్టర్లకు అవకాశం ఇచ్చి వారి కెరీర్ పుంజుకోవడానికి తారక్ కారణమయ్యారు. కొందరు హీరోలు కథలలో వేలు పెట్టి వాటిని ఇంకో రకంగా మార్చేస్తుంటాడు. అయితే తారక్ మాత్రం అలా పట్టించుకోరు. డైరెక్టర్లకు తమ సహాయ సహకారాలు అందిస్తాడు. అందుకే ఎన్టీఆర్ గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -