Holy Basil: తులసి మొక్క ప్రాధాన్యత గురించి మీకు తెలుసా?

Holy Basil: భారతదేశంలో హిందువులు కొన్ని రకాల మొక్కలను పూజిస్తూ ఉంటారు. అటువంటి మొక్కల్లో తులసి మొక్క కూడా ఒకటి. అంతేకాకుండా తులసి మొక్క అగ్రస్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. తులసి మొక్కతో పాటు వేప, రాగి, అరటి, జిల్లేడు, బిల్వపత్రి లాంటి మొక్కలను పూజిస్తూ ఉంటారు. అయితే హిందువులైన ఇండ్లలో దాదాపు అందరి ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీదేవి అలాగే విష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుంది.

అయితే తులసి మొక్కను పూజించే విషయంలో ఎన్నో రకాల పరిహారాలు విషయాలను తప్పకుండా పాటించాలి. తులసి మొక్కను ఇంటి బయట నాటడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుంది. అంతే కాకుండా తులసి మొక్క ఆర్థిక పరిస్థితులను కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా గ్రహణ సమయంలో మనం వండిన ఆహార పదార్థాలను తులసి ఆకులను వేస్తూ ఉంటారు. తులసిని ఎన్నో రకాల ఔషధాలు తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు.

 

కాగా పురాణాల ప్రకారం తులసి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులసి దలం లేకుండా శ్రీహరి ఆరాధన ఎప్పటికి సంపూర్ణంగా ఉండదు. అలాగే తులసి మొక్క ఉన్న ఇంట్లో వాస్తు దోషాల ప్రభావం తొలగుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు కూడా వెల్లివిరుస్తాయి. ఇల్లు కట్టేటప్పుడు పునాదిలో పసుపు రంగుతో తులసి వేరును ఉంచితే ఆ ఇంటిపై పిడుగు ప్రభావం ఉండది. తులసి మొక్క 24 గంటల పాటు ఆక్సిజన్ ను అందిస్తుంది. ఇది అద్భుతమైన ఎయిర్ ప్యూరీఫైర్ గా ఉంటుంది.

 

ఇది నాటిన చోట ఆక్సిజన్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు తులసి ఆకు రసాన్ని తాగితే చర్మ వ్యాధులు కూడా ధరి చేరవు. తులసిలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. జలుబు, దగ్గు, దంత వ్యాధులు, శ్వాసకోశ వ్యాధుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu-CM Jagan: చంద్రబాబు పని అయిపోయిందా.. జగన్ ను తక్కువగా చేసి తప్పు చేశారా?

Chandrababu-CM Jagan: ఏపీ సీఎం జగన్ మాజీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల మధ్య పచ్చ గడ్డి వేస్తే కూడా భగ్గు మంటుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎప్పుడు విమర్శలు గుప్పిస్తూ...
- Advertisement -
- Advertisement -