Devi Nagavalli: గతంలో వార్తలు చదివేవారు(న్యూస్‌రీడర్లు) నెలసరి జీతాలు తీసుకునేవారు. వారిని అంతగా పట్టించుకునేవారు. కానీ.. ప్రస్తుతం ఒక్కొ ఛానల్లో ఒక్కొ న్యూస్‌రీడర్లకు అభిమానులు సైతం పెరిగిపోతున్నారు. వారిప్పుడు న్యూస్ రీడర్లతో పాటు సెలబ్రెటీలు అయ్యారు.కొందరు న్యూస్ చదువుతూ కూడా ఇతరాత్ర కార్యక్రమాలు, సోషల్ మీడియాల్లోని పలు కార్యక్రమాల్లో పాల్గొని రెండు చేతులతో సంపాదిస్తున్నారు. టీవీ9 లో చాలాకాలంగా న్యూస్‌రీడర్‌గా విధులు నిర్వర్తిస్తున్నదేవి నాగవల్లి గతంలో బిగ్ బాస్‌షోలోనూ పాల్గొని తపదైన శైలిలో ఆడి అదరగొట్టింది.
బిగ్‌బాస్‌లో ఎక్కువ రోజులు ఉంటుందని అంరు భావించగా అకస్మాతుగా ఆమె తొందరగా బిగ్‌బాస్ హౌస్ నుంచి బటయకు వచ్చింది. బిగ్ బాస్ నుంచి∙బయటకు వచ్చిన వెంటనే ఆమె టీవీ9లో చేరింది. ఎప్పటిలాగే తన కార్యక్రమాలను నిర్వహించుకుంటుంది. బిగ్‌బాస్ తర్వాత టీవీ9 కి దూరంగా ఉండి ప్రత్యేక కార్యక్రమాలు చేసుకుంటుందని అంతా భావించారు, కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ టీవీ9 లోనే ఆమె కొనసాగుతోంది. ఆమెకు ఇతర చానళ్ల నుంచి కూడా చాలా ఆఫర్లు వచ్చినట్లు తెలిసింది.
అయినా కూడా టీవీ9 వదిలి వెళ్లే ఉద్దేశం ఆమెకు లేదు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న దేవీ నాగవల్లికి టీవీ 9 యాజమాన్యం నెలకు రూ. 2 లక్షల జీతం చెల్లిస్తున్నట్లు సమాచారం. ఆమె ప్రత్యేక కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియా ఇతర యాక్టివిటీస్ ద్వారా నెలకు మరో అదనంగా రూ. 50 వేల వరకు సంపాదిస్తుందని సమాచారం.
ఆమె సంపాదన నెలకు రూ. 2.50 వేలు సంపాదిస్తుందని మాటలు వినిపిస్తున్నాయి. దేవి నాగవల్లి ఒక సెలబ్రిటీ కావడంతో ఆ హోదాని కొనసాగించాలంటే కాస్త ఎక్కువగానే నెలవారి ఖర్చులు ఉంటాయి. ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతుంది.. ఆయనప్పటికీ ఆమె చాలా ధృడసంకల్పంతో ఉంటుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. ప్రతి విషయంలోనూ చాలా లోతుగా మాట్లాడుతూ, అన్ని విషయాల్లోనూ అవగాహన కల్పించుకునే దేవీ నాగవల్లి ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శవంతురాలు అనడంలో సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.