Naga Chaitanya: ప్రకటించిన తర్వాత ఆగిపోయిన నాగచైతన్య సినిమాలేంటో తెలుసా?

Naga Chaitanya: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట జోష్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య నటించిన తాజా చిత్రం కస్టడీ. ఈ సినిమా మే 12న విడుదల కానుంది. ఇకపోతే ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాను మిస్ చేసుకున్న పరుశురామ్ సినిమా ప్రాజెక్టు గురించి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

కేవలం ఆ సినిమా మాత్రమే కాకుండా నాగచైతన్య కెరీర్ లొ ప్రకటించి ఆగిపోయిన సినిమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నాగ చైతన్య, రాధామోహన్ డైరెక్షన్ లో గౌరవం అనే సినిమాని ప్రకటించారు. తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ మూవీ ఆగిపోయింది. నాగ చైతన్య, ఢమరుఖం డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో హలో బ్రదర్ సినిమా రీమేక్ ని ప్రకటించినప్పటికీ ఆ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. కాగా ఈ హలో బ్రదర్ రీమేక్ ఆగిపోవడంతో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో దుర్గ అనే చిత్రాన్ని ప్రకటించారు.

 

ఈ మూవీలో హన్సిక మోత్వాని హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. ఆ తరువాత దిల్ రాజు నిర్మాణంలో కొత్త డైరెక్టర్ శశి దర్శకత్వంలో నాగచైతన్య, రష్మిక మందన్న హీరో హీరోయిన్ లుగా అదే నువ్వు అదే నేను అనే సినిమాను ప్రకటించారు. కానీ ఈ చిత్రం కూడా ఆగిపోయింది. అదేవిధంగా నాగ చైతన్య,మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఒక చిత్రం ప్రకటించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాల్సి ఉంది. కానీ ఈ చిత్రం ప్రకటన తోనే ఆగిపోయింది.
నాగ చైతన్య, పరశురామ్ కాంబినేషన్ లో నాగేశ్వరరావు అనే సినిమాను ప్రకటించారు. అయితే దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని పక్కన పెట్టి, మహేష్ బాబుతో సర్కారువారి పాట.మూవీని తీశాడు. ఆ తరువాత నాగ చైతన్యతో మూవీ వస్తుంది అని అనుకున్నారు. కానీ దాని గురించి ఎలాంటి వార్త లేదు. తాజాగా కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో ఈ విషయం గురించి మాట్లాడుతూ ఆ విషయం గురించి మాట్లాడడమే వేస్ట్ అని అనేశారు నాగచైతన్య.

Related Articles

ట్రేండింగ్

Nandamuri Family: హరికృష్ణ చనిపోతే ముసలి కన్నీరు.. బాబు అరెస్ట్ అయితే పార్టీలు.. ఆ స్టార్ హీరో నిజస్వరూపమిదేనా?

Nandamuri Family: నిజ జీవితంలో మామూలుగా గొడవలు కొట్లాటలు ఉండడం అన్నది సహజం. అయితే ఎన్ని గొడవలు ఎంత మాట్లాడకపోకపోయినా కూడా చనిపోయినప్పుడు చివరిసారిగా కడసారిగా చూడడానికి అవన్నీ పక్కన పెట్టి వెళ్తూ...
- Advertisement -
- Advertisement -