Alia Bhatt: పాపకు అబ్బాయి పేరు పెట్టినున్న అలియా.. ఎందుకంటే?

Alia Bhatt: బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ రణ్‌బీర్ కపూర్-అలియాభట్ తల్లిదండ్రులయ్యారు. నవంబర్ 6వ తేదీన పండంటి ఆడబిడ్డను జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సౌత్ ముంబైలోని గిరిగావ్‌లోని హెచ్ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో ఆలియాభట్ ప్రసవం జరిగింది. దీంతో కపూర్ ఫ్యామిలీ, అభిమానులు ఆనందంలో మునిగి తేలారు. తమకు పాప పుట్టిన విషయాన్ని అలియాభట్ సోషల్ మీడియాలో ప్రకటించింది. దీంతో సెలబ్రిటీలు, అభిమానులు నెట్టింట శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ప్రస్తుతం అలియాభట్ పాప పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న రణ్‌బీర్ కపూర్-అలియాభట్ ఏప్రిల్ 14న వివాహబంధంతో ఒక్కటయ్యారు. అయితే వీరికి పెళ్లయిన రెండు నెలలకే అలియాభట్ ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీతోపాటు అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. పెళ్లికి ముందే అలియా ప్రెగ్నెంట్ అయిందని సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోలింగ్స్ తెగ పుట్టుకొచ్చాయి. ఇటీవల రణ్‌బీర్ కపూర్-అలియా జోడిగా ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటించారు. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్లు ప్రచారం జరిగింది.

 

 

 

అయితే తాజాగా అలియా తన కూతురికి పెట్టాలనుకుంటున్న పేరుపై ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో ఓ రియాలిటీ షోలో పాల్గొన్న అలియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అలియా కంటెస్టెంట్‌గా వచ్చిన ఓ చిన్న అబ్బాయిని తన పేరు అడుగుతుంది. దానికి ఆ చిన్నారి ‘అల్మా’ అని చెప్తాడు. అప్పుడు అలియా పేరు స్పెల్లింగ్ చెప్పమని కోరుతుంది. దానికి ఆ చిన్నారి ‘ALMAA’ అంటాడు. దానికి అలియా.. ‘అల్మా’ పేరు చాలా యూనిక్‌గా ఉందని, తనకు పుట్టబోయే పిల్లాడికి ఇదే పేరు పెడ్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం అలియాకు పాప పుట్టింది. దీంతో అలియా ‘అల్మా’ పేరును తన కూతురికి నామకరణం చేస్తుందా? లేదా వేరే పేరు పెడ్తుందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

MLA Grandhi Srinivas: పవన్ అభిమానులు లేకపోతే చిరు సినిమాలు ఆడవా.. వైసీపీ మూర్ఖత్వానికి హద్దుల్లేవా?

MLA Grandhi Srinivas: కొందరు రాజకీయ నాయకుల విమర్శలు చూస్తే నవ్వాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. చేసే విమర్శలకు జరిగే పరిణామాలకి ఏమాత్రం పొంతన కుదరని విమర్శలు వారినే నవ్వులపాలు...
- Advertisement -
- Advertisement -