Bunny: బన్నీని 20 ఏళ్లు వేధించిన బాధ ఏంటో తెలుసా?

Bunny: అల్లు రామలింగయ్య తర్వాత అల్లు ఫ్యామిలీ నుంచి సినీ రంగంలో యాక్టర్ గా ప్రవేశించిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గంగోత్రి మూవీ తో రాఘవేంద్రరావు డైరెక్షన్లో అల్లు అర్జున్ తెలుగు సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేశాడు. ఈ మూవీలో అల్లు అర్జున్ తో పాటు ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

గంగోత్రితో పబ్లిక్ లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న బన్నీ తన కెరియర్లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అతని సినిమాల పర్ఫామెన్స్ కొంచెం తక్కువనే చెప్పొచ్చు. మొదటి చిత్రం గంగోత్రి లో నార్మల్ లుక్స్ తో పెద్ద స్టైలిష్ గా కనిపించని బన్నీ అతని రెండవ చిత్రం ఆర్య టైంకి ఫుల్ మేకవర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రమంగా ఎదుగుతూ యూత్లో తనకంటూ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటూ బన్నీ ముందుకు దూసుకు వెళ్ళాడు.

కెరియర్ మొదలుపెట్టిన గంగోత్రి నుంచి రీసెంట్ గా చేసిన అలవైకుంఠపురం వరకు ఎన్నో మంచి సినిమాలో నటించినప్పటికీ బన్నీకి తన సినిమాలు అనుకున్నంత ఇండస్ట్రీ కాలేదు అన్న కొరత ఉందట. పుష్ప సృష్టించిన రికార్డుతో అతని మనసు కొంచెం శాంతించి ఉంటుందని సన్నిహితుల అభిప్రాయం.

మొదటినుంచి వైవిధ్యమైన నటనకు ప్రాధాన్యతను ఇచ్చే అల్లు అర్జున్ తన ప్రతి సినిమాకి ఎంతో వేరియేషన్ చూపిస్తూ వచ్చాడు. అతను సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ కూడా అతని పర్సనాలిటీకి మ్యాచ్ అయ్యేలా ఉండేలా చూసుకుంటాడు. మాస్ క్యారెక్టర్ అయినా ,క్లాస్ క్యారెక్టర్ అయినా బన్నీ ఎక్సలెంట్ గా చేస్తాడు. అయినా అతని మనసులో ఏదో కొరత దాగుంది అన్న విషయం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. ప్రస్తుతం పుష్ప సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించాడు. ఇప్పుడు షూటింగ్ జరుగుతున్న పుష్ప 2 కూడా ఊహించిన విధంగా సక్సెస్ సాధిస్తే టాలీవుడ్ లో అల్లు అర్జున్ తిరుగులేని హీరోగా నిలుస్తాడు.

Related Articles

ట్రేండింగ్

Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి...
- Advertisement -
- Advertisement -