Suriya: సూర్య కొనుగోలు చేసిన ఈ లగ్జరీ ఫ్లాట్ ధర ఎంతో తెలుసా?

Suriya: దక్షిణాది సిని ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న వారిలో నటుడు సూర్య ఒకరు. ఎన్నో అద్భుతమైన విభిన్న కథా చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి విజయాలను అందుకుంటున్నారు.ఇక సూర్య నటించిన సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ ఉండడంతో ఈయన సినిమాలన్నీ తెలుగులో కూడా విడుదలవుతూ తెలుగు ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి సూర్య గురించి గత కొద్ది రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

సూర్యకు తన కుటుంబ సభ్యులతో కలహాలు రావడంతో ఈయన కుటుంబం నుంచి వేరుగా విడిపోతున్నారంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా కుటుంబ కలహాల కారణంగా ఈయన తన భార్య పిల్లలను తీసుకొని వేరుగా ఉండాలని భావించారట. ఈ క్రమంలోని సూర్య తన ఫ్యామిలీతో కలిసి ముంబైకి షిఫ్ట్ అవ్వబోతున్నారనే వార్తలు వైరల్ గా మారాయి.

ఇకపోతే తాజాగా ఈయన ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాట్ కూడా కొనుగోలు చేశారని తెలుస్తుంది. ముంబైలో ఎక్కువగా సెలబ్రిటీలు నివసించే గేటెడ్ కమ్యూనిటీలో సూర్య ఫ్లాట్ కొనుగోలు చేశారట. 9000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉన్నటువంటి ఈ ఫ్లాట్ స్విమ్మింగ్ పూల్, జిమ్ సెంటర్, థియేటర్, పార్కింగ్ స్పాట్ వంటి అధునాతనమైన సౌకర్యాలతో ఉన్నటువంటి ఫ్లాట్ కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇలా అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి ఈ ఫ్లాట్ కోసం సుమారు 70 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తుంది.

 

ఈ విధంగా సూర్య కొనుగోలు చేసిన ఈ ఫ్లాట్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈయన ఈ ఫ్లాట్ కోసం 68 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా ఈ ఫ్లాట్ బుకింగ్ కోసం ఇతరతా ఖర్చులు కలిపి దాదాపు 70 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇక త్వరలోనే సూర్య తన భార్య పిల్లలతో కలిసి ఈ ఇంట్లోకి ప్రవేశించనున్నట్టు సమాచారం. ఇక సూర్య ప్రస్తుతం పలు సినిమా షూటింగ్ పనులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -