OverTime: ఓవర్ టైం పని చేస్తే ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసా?

OverTime: కరోనా మహమ్మారి తర్వాత చాలా వరకు ప్రైవేట్ ఉద్యోగులు వర్క్ ఫ్రొం హోం జాబ్ ను చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉద్యోగం చేసేటప్పుడు ఉదయం వెళ్లి సాయంకాలం వచ్చేవారు. కానీ వర్క్ ఫ్రం హోం కారణంగా చాలామంది కంటిన్యూగా సిస్టం వర్క్ చేస్తూ ఓవర్ నైట్ వరకు కంపెనీకి సంబంధించిన వర్కులు చేస్తూ ఉన్నారు. అయితే ఓవర్ నైట్ వరకు వర్క్ చేయడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అంటున్నారు నిపుణులు. మరి ఓవర్ నైట్ వరకు పనిచేయడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

వర్క్ ఫ్రం హోం కారణంగా చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. దాంతో పాటుగా వెన్నునొప్పి, నడుము నొప్పి, కళ్ళు మంట, కడుపునొప్పి, ఊబకాయం లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఓవర్ నైట్ వరకు సిస్టం ముందు అలాగే కూర్చుని ఉండటం వల్ల నడుము పట్టేయడంతో పాటు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం ఒక ఉదర సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. అలాగే సిస్టం ముందు తదేకంగా అలాగే చూడటం వల్ల కళ్ళపై ఎఫెక్ట్ కొట్టి కళ్ళు కూడా మండుతాయి. విటితో పాటుగా దీర్ఘకాలిక అలసట, ఏకాగ్రత తగ్గిపోవడం, మాదకద్రవ్యాలకు బానిస కావడం, కోపం రావడం, రోగనిరోధక శక్తి తగ్గడం, బంధాలు తెగిపోవడం, నిరాశ ఆత్మహత్యల వరకు ఇది దారి తీస్తుంది.

 

అలాగే కాళ్లుపట్టేయడం, తలనొప్పి, ఒత్తిడి లాంటి సమస్యలు కూడా వస్తాయి.. వర్క్ ఫ్రమ్ హోం వల్ల ఎదురయ్యే అతి పెద్ద సమస్య బరువు పెరగడం. సరైన సమయానికి తినకపోవడం.. రోజూలో ఎక్కువ సార్లు తినడం వలన బరువు పెరిగిపోతుంటారు. బరువు పెరగకుండా ఉండేందుకు వ్యాయామం చేయడం ఉత్తమం. రోజూ పొద్దున్న కనీసం అరగంట పాటైనా వ్యాయామం చేయడం ఉత్తమం. మానసిక సమస్యలు దూరం కావడానికి వ్యాయామం బాగా పనిచేస్తుంది. అలాగే ఒకే భంగిమలో ఎక్కువ సేపు కూర్చోవడం వలన చాలా మందిలో కండరాలు, వెన్నునొప్పి సమస్య ఎక్కువగా వస్తుంది. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి వెన్నుపూసను వంచుతూ కూర్చుకోకుడదు. నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇంకా ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి కూర్చున్న చోటు నుంచి అటు ఇటూ ఓ రెండు నిమిషాల పాటు నడవాలి.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -