Heart attack: యువతకు గుండెపోటు రావడం వెనుక అసలు కథ ఏంటో తెలుసా?

Heart attack: ఈమధ్య గుండెపోటు సమస్యలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. మామూలుగా 60 ఏళ్ల వయసులో ఉన్న వాళ్లకు గుండెపోటు వచ్చే సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. కారణం వాళ్ళ అనారోగ్య సమస్యలు, తీసుకునే ఆహార పదార్థాలు, ఇతర ఒత్తిడిల వల్ల గుండెపోటు సమస్యలు వస్తూ ఉంటాయి. పైగా వయసు పై పడటంతో కూడా అకస్మాత్తుగా గుండె సమస్యలు వస్తూ ఉంటాయి.

 

కానీ గత కొంతకాలం నుంచి గుండెపోటు సమస్య యువతను కూడా వేధిస్తుంది. పట్టుమని పాతికేళ్లు కూడా దాటకుండానే వయసులో ఉన్న వాళ్ళు గుండెపోటుతో మరణిస్తున్నారు. ఆ మధ్యనే చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక ఇటీవల సినీ నటుడు తారకరత్న కూడా 39 ఏళ్లలోనే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

అయితే ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడానికి అసలైన కారణాలు ఏంటో తెలియట్లేదు. మామూలుగా కొన్ని రోజుల కిందట గుండెపోటుతో మరణించిన వాళ్ళ ఆరోగ్య సమస్య గురించి పరిశీలిస్తే.. వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. అంతేకాకుండా తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా మంచివే. ఇక అతిగా వ్యాయామం చేసే వాళ్లు కూడా కాదు.

 

నిజానికి అతిగా వ్యాయామం అనేది జిమ్ములో ట్రైనర్స్ ఎవరిని ఎంత చేయాలో చెబుతూ ఉంటారు. చాలా వరకు కారణం అది కాకుండా ఉంటుంది. అంతేకాకుండా వాళ్లు ఎటువంటి ఒత్తిడి సమస్యలతో బాధపడుతున్న విషయం కూడా బయటపడలేదు. అలా ఎటువంటి కారణం లేకుండా వాళ్ళు మరణించడంతో కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయేమో అని కొందరు అంచనాలు వేస్తున్నారు.

 

అయితే ఆ మధ్య కరోనా ప్రపంచాన్ని ఎంతగా వణికించిందో చూశాం. అయితే ఈ భయంకరమైన వ్యాధి నుండి బయటపడటానికి వ్యాక్సిన్లు కూడా వేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల గుండె పోటు సమస్యలు వస్తాయని కొందరు.. అది కూడా ఎక్కువగా మగవాళ్ళకే వ్యాపిస్తుంది అని అన్నారు.

 

ఈ విషయం సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. కానీ ఇది ఎంత నిజమో, ఎంతవరకు అబద్ధమో తెలియదు కానీ.. అకస్మాత్తు గుండెపోటు సమస్యతో వ్యాక్సిన్ కారణం కావచ్చా అని అనుకుంటున్నారు. కాబట్టి జరగబోయేది ఎలా ఉంటుందో తెలియదు కానీ ముందుగానే అనారోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా ఉండటం మంచిదని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -