Sunny Leone: సన్నీ లియోన్ నిర్మాతలకు పెట్టే షాకింగ్ కండీషన్ ఏంటో తెలుసా?

Sunny Leone: శృంగార తార స్థాయి నుండి ఇప్పుడు హీరోయిన్ స్థాయికి ఎదిగిన స్టార్ సన్నీ లియోన్. గతంలో శృంగార తారగా ఉన్న సన్నీ లియోన్ ఇప్పుడు అలాంటి సినిమాలు మానేసి.. బాలీవుడ్ సినిమాలతో పాటు పలు ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. తెలుగులో కూడా పలు సినిమాల్లో మెరిసిన సన్నీ లియోన్.. తాజాగా మంచు విష్ణు హీరోగా చేసిన ‘జిన్నా’ సినిమాలో హీరోయిన్ గా అందరినీ ఆకట్టుకుంది.

ప్రస్తుతం సినిమాలు, తన కుటంబంతో గడుపుతున్న సన్నీ లియోన్.. ముంబైలో ఓ ఇంటిని కొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతోంది. అయితే బాలీవుడ్ లో తరుచుగా మెరిసే సన్నీ.. దక్షిణాది పలు భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తోంది. తాజాగా ఈ అమ్మడికి ఓ తమిళ సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చిందట. అయితే ఈ ఐటెం సాంగ్ షూట్ చేయడానికి ఆమె పలు కండీషన్లు పెట్టిందనే ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ కండీషన్లు ఏంటో తెలుసుకుందాం పదండి.

తమిళ డైరెక్టర్ జయమురుగన్ తీస్తున్న ‘తీ ఇవన్’ సినిమాలో సన్నీ లియోన్ కు ఐటెం సాంగ్ చేసే అవకాశం దక్కిందట. అయితే ఈ సాంగ్ కోసం అమ్మడు పలు కండీషన్లు పెట్టి.. అవి ఖచ్చితంగా పాటిస్తే కానీ తాను షూటింగ్ కు రాను అని ఖరాకండిగా చెప్పిందట. దాంతో డైరెక్టర్ తో పాటు నిర్మాత కూడా అందుకే ఓకే చెప్పాడట. సన్నీ లియోన్ ఏం కండీషన్లు పెట్టిందంటే..

తాను ఐటెం సాంగ్ చేసేటప్పుడు పిల్లలు అస్సలు ఉండకూదని సినిమా యూనిట్ కు సన్నీ లియోన్ ముందే కండీషన్ పెట్టిందట. షూటింగ్ టైంలో ఖచ్చితంగా కరోనా రూల్స్ పాటించాల్సిందే అని తేల్చి చెప్పిందట. అలాగే షూట్ టైంలో డైరెక్టర్‌, హీరో, కొరియోగ్రాఫర్‌, కెమెరా మ్యాన్‌ మాత్రమే ఉండాలి అని కండీషన్ పెట్టిందట. తాను పెట్టిన ఈ కండీషన్లను తప్పకుండా పాటిస్తే కానీ తాను షూటింగ్ కు రాను అని తేల్చి చెప్పిందట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Nomination: చంద్రబాబు నాయుడు నామినేషన్.. చరిత్రలో తొలిసారి ఈ విధంగా జరగబోతుందా?

Chandrababu Nomination: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ విజయం అందుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఏడుసార్లు కుప్పం నుంచి పోటీ చేయగా...
- Advertisement -
- Advertisement -