Lakshmi: ఆ రీజన్ వల్లే లక్ష్మి మూడు పెళ్లిళ్లు చేసుకున్నారా?

Lakshmi: సినీ ఇండస్ట్రీలో నటీనటులు బయట ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తారో? వారి వ్యక్తిగత జీవితాల్లో అంతే ఒడిదొడుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. తమ కష్టాలను ఎక్కడా బయట చెప్పుకోరు. అలాంటి కష్టాలే ‘ఓ బేబీ’ సినిమా ఫేమ్ నటి లక్ష్మి జీవితంలో కూడా జరిగాయి. సమంత లీడ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. ఈ మూవీలో బేబి పాత్రలో లక్ష్మి నటించారు. వాస్తవానికి లక్ష్మి అసలు పేరు ఎర్రగుడిపాడి వెంకట మహాలక్ష్మి.

 

చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇప్పుడు డెబ్బై ఏళ్ల వయసు దగ్గర పడినప్పటికీ ఇండస్ట్రీలో తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు లక్ష్మి తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో నటించారు. ఉత్తమ నటిగా ఏడు ఫిలింఫేర్ అవార్డులు కూడా వచ్చాయి. డెబ్బై ఏళ్ల వయసులో సమంతతో కలిసి ‘ఓ బేబీ’ సినిమా చురుకుగా నటించారు. ఆమె నటనకు ప్రేక్షకులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ‘ఓ బేబీ’ సినిమాలో సమంత తర్వాత ఎక్కువ అలరించింది లక్ష్మినే.

 

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో కలిసి ‘మిథునం’ సినిమాలో నటించారు. అయితే లక్ష్మి పారితోషికం తక్కువే అయినప్పటికీ.. ఆమె ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించారు. తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తూ.. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గా తన సత్తా నిరూపించుకున్నారు. లక్ష్మి టాలెంట్‌ను చూసి డైరెక్టర్లు సైతం ఆశ్చర్యపోతుంటారు. అయితే కెరీర్ పరంగా ఎంతో సక్సెస్‌ఫుల్‌గా రాణించే లక్ష్మి.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంది. లక్ష్మికి 15 ఏళ్ల వయసులో భాస్కర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లయిన కొత్తలో బాగానే ఉన్నారు.

 

కానీ ఇద్దరీ మధ్య మనస్పర్థలు రావడంతో ఐదేళ్లకే విడాకులు తీసుకుని దూరం అయ్యారు. ఆ తర్వాత లక్ష్మి మలయాళ నటుడు మోహన్ శర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ మోహన్ శర్మను కూడా విడాకులు ఇచ్చారు. ఏడేళ్ల పాటు ఒంటరిగానే ఉన్న లక్ష్మి.. ఆ తర్వాత శివచంద్రన్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది. అయితే లక్ష్మి మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి పెద్ద కారణమే ఉంది. ఆమెకు మగాళ్ల ఆధిపత్యం, గర్వం, అధికారతత్వం, అహంకారం నచ్చదట. అందుకే విడాకులు తీసుకుని మూడు పెళ్లిళ్లు చేసుకున్నాన్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

TDP Election Campaign: రాష్ట్రంలో ఎటు చూసినా పసుపు ప్రచారమే.. గెలుపుపై ఆశలు లేక వైసీపీ సైలెన్స్!

TDP Election Campaign: ఎన్నికలకు మరొక 20 రోజుల సమయం మాత్రమే ఉన్నటువంటి తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల వేగవంతం అయ్యాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా పసుపు ప్రచారం ఏ...
- Advertisement -
- Advertisement -