Star Heroine: ఆ స్టార్ హీరోయిన్ గురించి నమ్మలేని నిజాలు మీకు తెలుసా?

Star Heroine: హిట్ సినిమాలు తీస్తూ టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన వాళ్లలో రాజా చంద్ర ఒకరు. దాదాపు 35 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. కామెడీ, కుటుంబ కథా చిత్రాలు తీయడంలో రాజా చంద్ర సిద్ధహస్తుడు. అలాంటి ఆయన్ను ఎవరో హత్య చేయడం చిత్ర పరిశ్రమను షాక్ కు గురి చేసింది. ఈ ఘటన 1987 అక్టోబర్ నెలలో జరిగింది. ఆయన ఎలా చనిపోయారనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ విషయంపై ఓ సీనియర్ జర్నలిస్ట్ స్పందించారు. రాజా చంద్రను ఎవరో చంపేసి రోడ్డు పడేశారని ఆ జర్నలిస్ట్ అన్నారు.

 

హత్య జరిగింది వాస్తవమేనని ఆయన్ను చంపేసి రోడ్డుపై పడేశారని ఆ జర్నలిస్ట్‌ చెప్పారు. ఈ ఘటన తమిళనాడులోని మద్రాసు (చెన్నై)లో జరిగిందన్నారు. ఈ ఘటన అర్ధరాత్రి జరిగిందని.. అందరికీ పొద్దున తెలిసిందన్నారు. ‘ఒక తెలుగు వ్యక్తి డైరెక్టర్ రాజా చంద్రను గుర్తు పట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజాచంద్రకు ముగ్గురు సంతానం, భార్య ఉన్నారని చెప్పారు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు ఉన్నాడని తెలిపారు. కృష్ణవేణి ఆయనకు రెండో భార్య’ అని ఆయన తెలిపారు.

 

‘రాజా చంద్ర రెండో భార్య కృష్ణవేణి ఆయన సినిమాల్లో తరచూ నటిస్తుండేవారు. సినిమా షూటింగ్ సమయంలో వీరు సన్నిహితంగా ఉండటాన్ని చూసి అందరూ కామెంట్లు చేసేవారు. దీంతో వాళ్లిద్దరూ అనివార్యంగా పెళ్లి చేసుకున్నారని చెబుతారు. కానీ దానికి ముందే వాళ్ల మధ్య మంచి అనుబంధం ఉండేది. అదే వివాహానికి దారి తీసింది. మొదటి భార్య అనుమతితోనే రెండో పెళ్లి చేసుకున్నారు రాజాచంద్ర’ అని ఆ సీనియర్ జర్నలిస్ట్ చెప్పారు.

 

 

ఫోరెన్సిక్ రిపోర్టుతో నిజం బయటపడింది

‘కృష్ణవేణికి కూడా ఇది రెండో మ్యారేజ్. ఆమెకు చిన్నప్పుడే మొదటి పెళ్లి అయ్యింది. అయితే పలు విభేదాలతో ఆయన్ను వదిలేశారు. ‘నగ్నసత్యం’తో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన కృష్ణవేణికి కామెడీ పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు రాజా చంద్ర. ఆయన అసలు పేరు వెంకటేశ్వర్ రావు. ఆయన పేరును విజయ్ బాపినీడు మార్చారు. కామెడీ, సెంటిమెంట్ సినిమాలు బాగా చేయగలడని రాజాచంద్రకు మంచి పేరుండేది. అలాంటి సమయంలో ఆయన మర్డర్ జరగడం అందర్నీ షాక్ కు గురి చేసింది. ఆయన్ను ఎవరో చంపే రోడ్డుపై పడేశారు. పోలీసులు కూడా అది యాక్సిడెంట్ అనుకుని ముందు అలాగే కేసుగా నమోదు చేశారు. కానీ ఫోరెన్సిక్, పోస్ట్ మార్టమ్ రిపోర్టులో అది మర్డర్ అని తేలింది. మెడ పిసికి చంపినట్లు డాక్టర్లు చెప్పడంతో ప్రపంచానికి ఆయన ఎలా చనిపోయారో తెలిసింది. అనంతరం కృష్ణవేణిని తీసుకెళ్లి పోలీసులు విచారించారు. కొందరి మీద అనుమానాలు ఉన్నట్లు ఆమె తెలిపారు’ అని ఆ జర్నలిస్ట్ పేర్కొన్నారు.

Related Articles

ట్రేండింగ్

TDP Senior Leaders: టీడీపీలో ఈ 10 మంది సీనియర్ నేతలకు టికెట్ దక్కకపోవడానికి కారణాలివేనా.. ఏం జరిగిందంటే?

TDP Senior Leaders: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ అధినేతలు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల జాబితాను విడుదల చేసి...
- Advertisement -
- Advertisement -