Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ బావ గురించి ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

Junior NTR: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నందమూరి వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకోవడంతో పాటు గత సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా మారారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే జూనియర్ ఎన్టీఆర్ బావ కూడా టాలీవుడ్ స్టార్ హీరో అన్న విషయం చాలామందికి తెలియదు. ఇంతకీ ఎవరు ఆ స్టార్ హీరో? వారు అని అనుకుంటున్నారా. అతను మరెవరో కాదు ఒకప్పటి స్టార్ హీరో వడ్డే నవీన్. కాగా నవీన్ నందమూరి కుటుంబానికి అల్లుడు అన్న విషయం చాలామందికి తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ వ‌డ్డే నవీన్ కు బావమరిది అవుతాడు. మొదట వడ్డే నవీన్ నందమూరి ఫ్యామిలీకి చెందిన అమ్మాయినే వివాహం చేసుకున్నాడు. నందమూరి తారకరామారావు కుమారుడైన రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు నవీన్. ఈ సంబంధం ఎన్టీఆర్ స్వ‌యంగా కుదిర్చారు.

 

అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు కారణంతో విడాకులు తీసుకున్నాడు. ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ‌డ్డే న‌వీన్ చాలా బాగుంది, ప్రేమించే మనసు, మనసిచ్చి చూడు, మా బాలాజీ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నడు. వడ్డే నవీన్ చాలా తక్కువ సినిమాల్లో నటించినా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

 

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -